LOADING...
Kanuma Festival Travel: కనుమ పండుగ రోజున ప్రయాణం చేయకూడదా?.. దీని వెనుక ఉన్న కారణాలివే!
కనుమ పండుగ రోజున ప్రయాణం చేయకూడదా?.. దీని వెనుక ఉన్న కారణాలివే!

Kanuma Festival Travel: కనుమ పండుగ రోజున ప్రయాణం చేయకూడదా?.. దీని వెనుక ఉన్న కారణాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2026
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగకు మరుసటి రోజు కనుమ (Kanuma Festival) జరుపుకుంటారు. ప్రతేడాది 12 సంక్రాంతులు వచ్చే విధంగా కనుమ కూడా వస్తుంది. ముఖ్యంగా మకర సంక్రాంతి తరువాత వచ్చే కనుమను ప్రత్యేకంగా ఘనంగా నిర్వహిస్తారు. ఇది పాడి పశువుల పండుగగా ప్రసిద్ధి చెందింది. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత తెలుపుతారు. పంటను పశుపక్ష్యాదులతో పంచుకునే ఉద్దేశ్యంతో, పిట్టల కోసం ఇంటి గుమ్మాల్లో ధాన్యపు కంకులను అన్నదాతలు కడతారు. అలాగే కనుమ రోజు కాకులు కూడా కదలవు అనే సామెతకు అనుగుణంగా, ఈ రోజు ప్రయాణాలు చేయరాదు అని పూర్వీకులు చెబుతుంటారు.

Details

పశువులను గొప్ప సంపదగా భావిస్తారు

పల్లెల్లో పశువులను గొప్ప సంపదగా భావిస్తారు. అవి ఆనందంగా ఉంటేనే రైతుకు సంతోషం. కనుమ రోజున పల్లెలో పశువులకు విశ్రాంతి కల్పించడానికి ఏ పనికీ తోడ్పడకుండా చూసి, రకరకాల పోటీలు, ఆటలు నిర్వహించి పశువులు, రైతులు ఇద్దరూ ఆనందిస్తారు. ఈ ఆచారం వెనుక ఓ గొప్ప కారణం ఉంది. పూర్వకాలంలో ప్రయాణాలకు ఎక్కువగా ఎద్దులను ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజిస్తూ, ఆ ఒక్క రోజైనా వాటికి విశ్రాంతి ఇవ్వాలని ఆలోచనతో ఆ రోజు ప్రయాణాన్ని వాయిదా వేసేవారు.

Details

తెలంగాణ ప్రాంతాల్లో 'గురుగుల నోము'

నేటి వేగవంతమైన జీవితంలో పండుగ సమయంలో బంధుమిత్రులు వెంటనే వెళ్లిపోకుండా, అందరితో ఆనందంగా గడిపేందుకు, కలిసి భోజనం చేసి కష్టసుఖాలను పంచుకునేందుకు కూడా ఈ నియమాన్ని పాటిస్తారు. అదనంగా తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల 'గురుగుల నోము' ఆచరించటం జరుగుతుంది. కొత్తగా పెళ్లైన వారు పండుగ సమయంలో మట్టితో చిన్న పాత్రలు తయారు చేసి, అందులో బెల్లం, నువ్వులు, చెరకు ముక్కలు, చిల్లర, రేగుపళ్లు, జీడిపళ్లు లాంటి వస్తువులను ఉంచి, తాంబూలంగా ఇస్తారు. ఈ సంప్రదాయం ఆ ప్రాంతంలో తరచుగా పాటిస్తారు.

Advertisement