చర్మ సంరక్షణ: దద్దుర్ల నుండి విముక్తి పొందడానికి ఈ టిప్స్ పాటించండి
చర్మంపై అనేక కారణాల వలన దద్దుర్లు ఏర్పడతాయి. దద్దుర్ల వల్ల కలిగే దురద, ఇబ్బంది మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం దద్దుర్లను పోగొట్టుకునేందుకు పనికొచ్చే ఇంటి చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. కలబంద: చర్మ సంరక్షణలో కలబంద చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ ధర్మాల కారణంగా చర్మానికి మేలు జరుగుతుంది. దద్దుర్లు ఏర్పడిన ప్రదేశంలో కలబంద రసం పూసుకుని ఉదయం లేవగానే శుభ్రంగా కడిగితే చాలు. ఇలా దద్దుర్ల సమస్య పూర్తిగా తగ్గే వరకు చేయాలి. గ్రీన్ టీ: దీన్ని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల దద్దుర్లు తగ్గిపోతాయి. ఇందులోని పాలిఫినాల్స్ రసాయనాలు చర్మాన్ని రిపేర్ చేస్తాయి.
దద్దుర్లను మాయం చేసే ఇంట్లో ఉండే వస్తువులు
కొబ్బరి నూనె: దద్దుర్ల వల్ల దురద మరీ ఎక్కువగా ఉన్నట్లయితే కొబ్బరి నూనె నుండి మంచి ఉపశమనం పొందవచ్చు. దద్దుర్ల ప్రదేశంలో కొంత కొబ్బరి నూనె రాస్తే సరిపోతుంది. ఇలా ప్రతిరోజూ చేస్తే దద్దుర్లు తగ్గిపోతాయి. బేకింగ్ సోడా: దద్దుర్ల వల్ల దురద, చిరాకు కలిగినట్లయితే వెంటనే బేకింగ్ సోడాను ఉపయోగించండి. కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని దానికి నీళ్ళు కలిపి పేస్ట్ లాగా చేసి దద్దుర్ల మీద పూయాలి. పొద్దున్న లేవగానే చల్లని నీటితో కడిగితే సరిపోతుంది. పసుపు: పసుపులో ఉండే కర్క్యుమిన్ కారణంగా చర్మానికి మంచి సాయం జరుగుతుంది. పసుపులో నీళ్ళు కలిపి పేస్టును దద్దుర్ల మీద పూసుకుని తెల్లారి లేవగానే గోరు వెచ్చని నీటితో కడగాలి.