చర్మ సంరక్షణ: మీరు వాడుతున్న సన్ స్క్రీన్ ఎలర్జీ కలుగజేస్తుందని తెలిపే సంకేతాలు
చర్మ సంరక్షణలో సన్ స్క్రీన్ పాత్ర చాలా ఉంటుంది. సూర్యుడి నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలు చర్మాన్ని పాడుచేయకుండా సన్ స్క్రీన్ లోషన్ కాపాడుతుంది. ఐతే చర్మానికి వాడే ఏ సాధనమైనా అది హాని చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే చర్మ సాధనాల్లో వాడే రసాయనాల వల్ల కొన్నిసార్లు అలర్జీలు వస్తాయి. మీ చర్మానికి సరిపడే సన్ స్క్రీన్ వాడకపోతే అది దద్దుర్లు, చర్మం ఎరుపుగా మారడం వంటి అనేక ఇబ్బందులకు తీసుకొస్తుంది. ప్రస్తుతం మీ చర్మానికి సరిపడే సన్ స్క్రీన్ వాడకపోతే వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. దురద: సెన్నామేట్స్, బెంజోఫినాన్స్ అనే రసాయనాలు మీరు వాడుతున్న సన్ స్క్రీన్ లో ఉంటే చర్మానికి దురద కలుగుతుంది.
సన్ స్క్రీన్ వల్ల వచ్చే అలర్జీ
చర్మం ఉబ్బడం: మీరు సన్ స్క్రీన్ ఎక్కడైతే మర్దన చేస్తారో అక్కడ చర్మం ఉబ్బడం జరుగుతుంది. కొన్ని కొన్నిసార్లు ఉబ్బిన ప్రాంతాల్లో నొప్పిగా ఉంటుంది. చర్మం ఎరుపురంగులోకి మారడం: సన్ స్క్రీన్ మర్దన చేసిన ప్రాంతాల్లో చర్మం ఎరుపురంగులోకి మారుతుంది. ఇది నొప్పిగా ఉండదు కానీ, చూసేవాళ్ళకి వికారంగా కనిపిస్తుంది. బొబ్బలు: చర్మం మీద బొబలు ఏర్పడి ఒక్కోసారి చీము కారుతుంటుంది. ఇది నొప్పిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. కొన్ని రోజుల పాటు మోచేతి భాగాల్లో మాత్రమే సన్ స్క్రీన్ మర్దన చేసుకుని చూడండి. ఎలాంటి రియాక్షన్స్ లేకపోతే హ్యాపీగా వాడుకోవచ్చు.