Glow Up this Diwali : దీపావళి రోజున అందంగా కనిపించేందుకు టిప్స్
దీపావళి సమీపిస్తోంది ఈ సమయంలో మీరు కూడా దీపంలా కాంతివంతంగా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే, కెమికల్స్ లేని, సహజమైన ఫేస్ ప్యాక్స్‌ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. చర్మాన్ని హానీ చేయకుండా గ్లో తీసుకురావడంలో వీటివల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఈ పండుగ సమయానికి మీ స్కిన్‌కి ఇన్‌స్టాంట్ గ్లో తెప్పించే ఫేస్ ప్యాక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇన్‌స్టాంట్ గ్లో తెప్పించే ఫేస్ ప్యాక్స్
1. కుంకుమ పువ్వుతో ఇన్‌స్టాంట్ గ్లో: కుంకుమ పువ్వు మీ చర్మానికి సహజమైన ప్రకాశం ఇస్తుంది. రాత్రి కొన్ని కుంకుమ పువ్వులు పాలలో నానబెట్టి ఉదయం అందులో తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. దానిని 15 నిమిషాలపాటు ఉంచి, గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం మెరుస్తుంది. 2. పసుపు స్కిన్ టోన్ మెరుగుపరిచే ఫేస్ ప్యాక్: పసుపు చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. శనగపిండి, పసుపు, పెరుగు కలిపి పేస్ట్ చేసి ముఖానికి పూసుకుని, 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది.
ఇన్‌స్టాంట్ గ్లో తెప్పించే ఫేస్ ప్యాక్స్
3. రోజ్ వాటర్ టోనర్: రోజ్ వాటర్ సహజ టోనర్‌గా పనిచేస్తుంది. కాటన్ ప్యాడ్‌కి రోజ్ వాటర్ తీసుకుని ముఖాన్ని క్లెన్స్ చేస్తే, స్కిన్ క్లీన్, ఫ్రెష్‌గా ఉంటుంది. 4. బాదం నూనెతో మసాజ్: బాదం నూనెలోని విటమిన్ E చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తుంది. రాత్రి నిద్రకు ముందు కొంచెం బాదం నూనె తీసుకుని ముఖానికి మసాజ్ చేస్తే, ఉదయాన్నే చర్మం ప్రకాశిస్తుంది. 5. గంధం పొడి ఫేస్ ప్యాక్: గంధం పొడి చర్మ శ్రేయస్సు కోసం ఉపయోగించబడుతుంది. గంధం పొడిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసి ఆరేవరకు ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే, మీరు గ్లోయింగ్ స్కిన్ పొందుతారు.
ఫేస్ ప్యాక్స్ రెగ్యులర్‌గా ఫాలో అయితే..
6. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్: ఓపెన్ పోర్స్ సమస్య ఉందా? అయితే, ముల్తానీ మట్టి అద్భుత పరిష్కారం. దీనిలో రోజ్ వాటర్ కలిపి అప్లై చేసి పావు గంట తరువాత చల్లటి నీటితో కడిగితే, చర్మం రిఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ ఫేస్ ప్యాక్స్‌ను పండగ సమయంలో మాత్రమే కాకుండా, రెగ్యులర్‌గా ఫాలో అయితే చర్మం అందంగా, హైడ్రేటింగ్‌గా ఉంటుంది.