Loading...
Sonia Gandhi: మ్యూజియంగా సోనియా గాంధీ చిన్ననాటి ఇల్లు.. కొనుగోలు చేసిన పంజాబ్ వ్యాపారవేత్త
మ్యూజియంగా సోనియా గాంధీ చిన్ననాటి ఇల్లు.. కొనుగోలు చేసిన పంజాబ్ వ్యాపారవేత్త

Sonia Gandhi: మ్యూజియంగా సోనియా గాంధీ చిన్ననాటి ఇల్లు.. కొనుగోలు చేసిన పంజాబ్ వ్యాపారవేత్త

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇటలీలో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించిన ఇల్లు త్వరలో మ్యూజియంగా మారనుంది. భారత్ నుంచి ఇటలీకి వలస వెళ్లిన పంజాబ్‌కు చెందిన సిక్కు వ్యాపారవేత్త సుఖ్‌దేవ్ సింగ్ కాంగ్ ఈ ఇంటిని ఆరేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ ఇంటిని ఆధునిక మ్యూజియంగా అభివృద్ధి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రదర్శనకు అవసరమైన ఫొటోలు,వ్యక్తిగత వస్తువులు,ఇతర జ్ఞాపికలను సేకరించేందుకు గాంధీ కుటుంబ సభ్యులను కలవాలని ఆసక్తి చూపుతున్నారు. ''ఈ ఇంటిని ఇండియన్ హౌస్ అని పిలుస్తారు.ఇంటిపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. బయట ఉన్న నేమ్‌ప్లేట్‌పై'సోనియా గాంధీ జన్మస్థలం'అని రాసి ఉంటుంది''అని సుఖ్‌దేవ్ సింగ్ కాంగ్ పీటీఐ వార్తా సంస్థకు ఫోన్‌లో వెల్లడించారు.

వివరాలు 

ఇటలీలో స్థిరపడిన కాంగ్..  

ఇటలీలోని విసెంజా ప్రావిన్స్‌లో ఉన్న లూసియానాలో ఈ ఇల్లు ఉంది.

గ్రే స్టోన్, కాంక్రీటుతో నిర్మించిన ఈ భవనంలో ఆరు గదులు ఉన్నాయి.

తన నివాసమైన బ్రెసియా నుంచి అక్కడికి చేరుకోవడానికి సుమారు గంట సమయం పడుతుందని 52 ఏళ్ల కాంగ్ తెలిపారు.

సోనియా గాంధీ 1946 డిసెంబర్ 9న ఇదే ఇంట్లో జన్మించారని, బాల్యంలో కొంతకాలం ఇక్కడే గడిపారని గుర్తుచేశారు.

పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాకు చెందిన సుఖ్‌దేవ్ సింగ్ కాంగ్ 1992లో ఇటలీకి వలస వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు.

అయితే కొత్త దేశంలో జీవితం ప్రారంభించడం అంత సులభంగా సాగలేదని ఆయన చెప్పారు.

గతంలో డెయిరీ ఫామ్, వ్యవసాయ రంగంతో పాటు ఓ ఫ్యాక్టరీలోనూ పనిచేసినట్లు వివరించారు.

వివరాలు 

భార్య, కుమార్తె పేర్లపై కొనుగోలు

2020లో తన భార్య,కుమార్తె పేర్లపై ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు కాంగ్ వెల్లడించారు.

ఇంటి సంరక్షణ కోసం అక్కడ ఓ కేర్‌టేకర్‌ను నియమించారు. ఈ ఇంటిని చూడటానికి వచ్చే పర్యాటకులకు ఆయన సహాయం చేస్తుంటారు.

ఇంటి నిర్వహణ,ఆస్తి పన్ను తదితర ఖర్చుల కోసం ఏటా సుమారు 1,000యూరోలు వెచ్చిస్తున్నట్లు కాంగ్ తెలిపారు.

తమ కుటుంబానికి గాంధీ కుటుంబం అంటే ఎంతో అభిమానమని ఆయన చెప్పారు.

ప్రతి సంవత్సరం సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని పెద్ద ఎత్తున బహిరంగ వేడుక నిర్వహిస్తామని వెల్లడించారు.

ఈ ఇంటిని కొనుగోలు చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ.. ఇటలీలోని తన పరిచయస్తుల ద్వారా ఓ విషయం తెలిసిందన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

మ్యూజియంగా మారితే పర్యాటకులకు మరో ఆకర్షణ

ఆ ఇంటిని భారతీయ, ముఖ్యంగా సిక్కు కుటుంబానికి చెందినవారు కొనుగోలు చేస్తే బాగుంటుందని అక్కడి వారు భావించారని చెప్పారు. దీంతో తాను ఆ ఇంటిని సొంతం చేసుకున్నట్లు వివరించారు.

ఇంటిని కొనుగోలు చేసినప్పటి నుంచే ఏదో ఒకరోజు మ్యూజియంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో దానిని అలాగే ఉంచారు.

ఈ మ్యూజియం అందుబాటులోకి వస్తే ఇటలీని సందర్శించే భారతీయ పర్యాటకులకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కాంగ్ భావిస్తున్నారు.

మ్యూజియం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే వందలాది మంది సందర్శకులు వస్తారని, తద్వారా స్థానిక గ్రామ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆయన భార్య, కుమార్తె కూడా ఈ ఆలోచనకు మద్దతు ఇస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

మ్యూజియంగా మారితే పర్యాటకులకు మరో ఆకర్షణ

సోనియా గాంధీ, ఆమె పుట్టింటి కుటుంబమైన మైనో కుటుంబంతో ఈ ఇంటికి ఉన్న చారిత్రక అనుబంధాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో గతంలో వచ్చిన కొన్ని ప్రతిపాదనలను తమ కుటుంబం తిరస్కరించిందని కాంగ్ తెలిపారు.

ఇంటిని అద్దెకు ఇవ్వాలని, గురుద్వారాగా మార్చాలని కొందరు ప్రతిపాదించినప్పటికీ వాటికి అంగీకరించలేదని చెప్పారు.

వివరాలు 

గాంధీ కుటుంబాన్ని కలవాలని యోచన

ఈ ఇంటిని వీలైనంత త్వరగా ఆధునిక సౌకర్యాలతో కూడిన మ్యూజియంగా అభివృద్ధి చేయాలని కాంగ్ కోరుకుంటున్నారు.

అయితే సోనియా గాంధీ కుటుంబానికి సంబంధించిన సమాచారం,జ్ఞాపికలు అందుబాటులో లేకపోవడం ఈ ప్రాజెక్టుకు కొంత ఆటంకంగా మారింది.

ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో పాటు ఆమె పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలవాలని భావిస్తున్నారు.

మ్యూజియంలో ఎలాంటి వ్యక్తిగత వస్తువులు, పాత ఫొటోలు, పత్రాలు, ఇతర జ్ఞాపికలను ప్రదర్శించవచ్చో వారి ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

''మ్యూజియం కోసం మాకు చాలా వస్తువులు అవసరం. అవి అందుబాటులోకి వచ్చిన వెంటనే ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతాం'' అని కాంగ్ తెలిపారు.

వివరాలు 

గాంధీ కుటుంబాన్ని కలవాలని యోచన

ఇటీవల సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' విడుదల కావడంతో ఇటలీలో ఆమె గడిపిన బాల్యంతో పాటు జీవితంలోని ఇతర అంశాలపై మరోసారి ఆసక్తి పెరిగింది.

ఈ పుస్తకాన్నిచదవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కాంగ్ చెప్పారు.

కొన్నేళ్లక్రితం పంజాబ్‌కు చెందిన తన స్నేహితులు సోనియా గాంధీ చిన్ననాటి ఇంటిని చూశావా? అని తనను అడిగేవారని గుర్తుచేసుకున్నారు.

''ఒకప్పుడు తన అత్తగారు దేశానికి ప్రధానిగా ఉన్న కుటుంబంలోకి కోడలిగా వెళ్తానని సోనియా గాంధీ ఊహించి ఉంటారా?అలాగే,కొన్నేళ్ల క్రితం వరకు ఆమె పూర్వీకుల ఇంటి తాళాలు ఏదో ఒకరోజు నా చేతికి వస్తాయని నేనైనా అనుకున్నానా?''అంటూ ఈ అరుదైన అవకాశం దక్కడం పట్ల తన ఆనందాన్ని కాంగ్ వ్యక్తం చేశారు.

ADVERTISEMENT