Page Loader
International Men's Day 2024: మగవారికి ప్రత్యేక సూచనలు.. ఈ విషయాలపై దృష్టి సారించండి
మగవారికి ప్రత్యేక సూచనలు.. ఈ విషయాలపై దృష్టి సారించండి

International Men's Day 2024: మగవారికి ప్రత్యేక సూచనలు.. ఈ విషయాలపై దృష్టి సారించండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 19, 2024
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

నవంబర్ 19న ప్రతేడాది జరుపుకునే అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. సమాజంలో లింగ సమతుల్యత అంశం ప్రధానంగా ఉండగా, పురుషులు తమ సమస్యలను వ్యక్తపరచడంలో ఎదుర్కొనే ఇబ్బందులు మనసు పిండేస్తాయి. ఈ ఒత్తిడులు వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళల కంటే పురుషుల మానసిక సమస్యలు తక్కువ అనిపించినా, వారి సమస్యలను ఎవరికీ చెప్పుకోరు. పురుషులు తమ సమస్యలను బయటపెట్టే విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. దీనివల్ల వారికి మానసిక ప్రశాంతత దూరమవుతుంది. కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించడం ద్వారా పురుషులు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

Details

1. స్నేహితులతో సమయం గడపడం 

బిజీ జీవనశైలిలో స్నేహితులను మర్చిపోవడం సాధారణం. కానీ మనం నమ్మగలిగే, మనసు విప్పి మాట్లాడగలిగే స్నేహితులు ఉండటం ఎంతో అవసరం. నమ్మకమైన వ్యక్తుల సాయంతో మానసిక సమస్యల్ని తగ్గించుకోవచ్చు. 2. వ్యాయామం, ధ్యానం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం లేదా యోగా ద్వారా ఆందోళన తగ్గుతుంది. 3. హాబీని అభివృద్ధి చేసుకోండి మీకు నచ్చిన పనిలో రోజులో కొంత సమయం గడపాలి. ఇది ఆందోళన నుంచి దూరంగా ఉండే మార్గమవుతుంది. వంటకం, పెయింటింగ్, సంగీతం, ట్రెక్కింగ్‌ వంటి వాటిపై ఆసక్తి పెంచుకోవాలి.

Details

4. పౌష్టికాహారం ఆహారం అవసరం

పోషకాహారం తినడం అనేది ఆరోగ్యకర జీవనశైలికి కీలకం. కూరగాయలు, పండ్లు, నట్స్, కాయధాన్యాలతో కూడిన ఆహారం తినండి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా నివారించాలి. 5. నిపుణులను సంప్రదించండి తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు మానసిక నిపుణులను కలవండి. థెరపీ ద్వారా ఆందోళనను తగ్గించుకోవచ్చు. పురుషులు తమ జీవితాలను సమర్థవంతంగా నడిపించేందుకు ప్రయత్నిస్తూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్బంగా ఈ విషయాలను గుర్తించి వారిని ప్రోత్సహిద్దాం.