LOADING...
Telugu Language Day 2025: నేడు తెలుగు భాషా దినోత్సవం.. శిలా ఫలకాల నుంచి డిజిటల్ స్క్రీన్ వరకూ భాషా ప్రస్థానం
నేడు తెలుగు భాషా దినోత్సవం.. శిలా ఫలకాల నుంచి డిజిటల్ స్క్రీన్ వరకూ భాషా ప్రస్థానం

Telugu Language Day 2025: నేడు తెలుగు భాషా దినోత్సవం.. శిలా ఫలకాల నుంచి డిజిటల్ స్క్రీన్ వరకూ భాషా ప్రస్థానం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు భాష తన ప్రస్థానంలో ఎంతో ప్రత్యేకతతో, సౌందర్యంతో నిండినది. ప్రారంభం ఎక్కడో దూరంలోని గుహలలో రాతి గోడలపై ఉండే చిత్రలేఖనాల నుండి మొదలై, శిలా ఫలకాలు, తామ్రపత్రాలు, తాళపత్రాల మీద రాసే విధానాలను దాటుతూ, చివరగా కాగితం మీద వెలిగి, నేటి డిజిటల్ స్క్రీన్‌ పరిధిలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణం తెలుగు భాషకు ఒక ఘన చరిత్రను అందిస్తుంది. కాలానుగుణ మార్పులకీ అనుగుణంగా తెలుగు భాష తన స్వరూపాన్ని మార్చుకుంటూ, అందాన్ని కోల్పోకుండా, సులభంగా వినియోగదారులకు చేరేలా సాగింది. తెలుగు భాష తన రూపాన్ని అందంగా మార్చుకుంటూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అక్షరాలను చేర్చుకుంటూ నేటి ఆధునిక రూపానికి చేరింది.

నన్నయ

11వ శతాబ్దపు తెలుగు లిపి (నన్నయ కాలం)

ఈరోజు, ఆధునిక తెలుగు భాషకు ముఖ్యమైన రచయిత, వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతుల జయంతి, 'తెలుగు భాషా దినోత్సవం' సందర్భంగా ప్రత్యేకంగా తెలుగు భాషపై ప్రత్యేక కథనం. తెలుగు భాషా చరిత్ర ప్రకారం,క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి కృష్ణదేవరాయల కాలం వరకు కొన్ని అక్షరాలు.. ఎ,ఒ,అం,అః,క్ష.. మన భాషలో లేవు. ఇప్పటికీ కొన్ని అక్షరాలు వాడకం తగ్గినవి,ఉదాహరణకు 'ఱ'. ప్రారంభంలో తెలుగు అక్షరాలు అడ్డం, నిలువు గీతలతో, కొంత వంకరగా ఉండేవి. కానీ ఘంటంతో తాళపత్రాలపై రాసే క్రమంలో, అక్షరాలు సౌందర్యాన్ని పొందుతూ గుండ్రంగా మారి, ముత్యాల శ్రేణిలా కనిపించాయి. నిపుణుల ప్రకారం, తెలుగులో అక్షరాల ప్రస్తుత రూపం సుమారు రెండు వేల ఏళ్లకు పైగానే పట్టినట్లు బాషా నిపుణులు చెబుతారు.

కృష్ణదేవరాయలు 

పెద్దన కాలపు లిపి (కృష్ణదేవరాయల శాసనం)

ప్రారంభంలో తెలుగు, కన్నడ భాషలకు ఒకే లిపి ఉండేది. క్రీస్తు శకం 6వ శతాబ్దానికి 'తెలుగు-కన్నడ లిపి' ఏకరూపంగా అభివృద్ధి చెందింది. నేడు మనం ఉపయోగించే తెలుగు, కన్నడ లిపుల మూలం ఇదే అని భాషా నిపుణులు చెబుతున్నారు. క్రీ.శ. 625 నుంచి 1189 మధ్య వేంగి చాళుక్యుల శాసనాలు ఈ లిపిలో రాసి ఉన్నాయి. 15వ శతాబ్దం తర్వాత, తెలుగు, కన్నడ లిపులు విడిపోయాయి. తెలుగు అక్షరాలపై ఉండే చిన్న అడ్డగీతలు తలకట్టుగా మారాయి, వంకరగా ఉండే అక్షరాలు గుండ్రంగా మారాయి.

గుండ్రం

గుండ్రంగా మార్చిన ఘనత నన్నయ్యదే

మొదట్లో గీతలు, చతురస్రాకారంలో ఉండే తెలుగు లిపిని గుండ్రంగా మార్చినవారు కవిత్వంలో ముందొచ్చిన నన్నయ్య. ఆయననే ఆంధ్ర మహాభారతాన్ని ఆ లిపిలో రాశారని నందనపూడి శాసనాలు చెబుతున్నాయి. అప్పట్లో తాళపత్రాలపై రాసే ప్రక్రియలో, ఘంటంతో రాస్తే సులభంగా ఉండటంతో, ఈ అలవాటు క్రమంగా లిపి గుండ్రంగా మారడం మొదలై, ఇప్పుడు మనకు తెలిసిన తెలుగు అక్షరాల రూపం ఏర్పడింది.

వెయ్యి అక్షరాలు

వెయ్యి అక్షరాలు 98 సంకేతాల్లో..

తెలుగులో అచ్చులు, హల్లులు, గుణింతాలు, ద్విత్వాక్షరాలు, ఉభయాక్షరాలు, సంయుక్త అక్షరాలతో కలిపి సుమారు వెయ్యికి పైగా సంకేతాలు ఉండేవి. ముద్రాలేఖనులు, టైప్‌రైటర్లు, ముద్రణ యంత్రాల రాకతో, కొన్ని సంకేతాలు మాయమయ్యాయి, కొన్ని కొత్త సంకేతాలు చేరాయి. 1935లో పిఠాపురం రాజావారు వెయ్యి అచ్చు ములుకులను 98 సంకేతాలకు కుదించి, తెలుగులో తొలి టైప్‌రైటర్ రూపాన్ని సృష్టించారు. తెలుగు టైపోగ్రఫీ మార్పులు మాధ్యమాల విస్తృతి కారణంగా,కొన్ని అక్షరాలను కూర్పు నుంచి తీసివేయాల్సి వచ్చింది. నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పులిచర్ల దేవకాంత్ ప్రకారం,కొంతమంది అక్షరాల రూపాలు మార్చబడ్డాయి. కృత్రిమ మేధ ప్రభావంతో కూడా,తెలుగు లిపిలో కొన్ని మార్పులు క్రమంగా వస్తున్నాయి. ఆయన అభిప్రాయం ప్రకారం,తెలుగు టైపోగ్రఫీ,ఫాంట్ తయారీపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.