ఒకరోజును సమంగా చేసే మార్చ్ విషువత్తు గురించి మీకు తెలియని విషయాలు
వసంత విషువత్తు.. భూమధ్య రేఖకు ఎదురుగా ఉంటూ దక్షిణార్థ్ర గోళం నుండి ఉత్తరార్థ్ర గోళానికి సూర్యుడు వెళ్ళడాన్ని వసంత విషువత్తు అంటారు. ఇలా రెండు విషువత్తులు ఉంటాయి. సెప్టెంబర్ నెలలోనూ విషువత్తు కనిపిస్తుంది. విషువత్తు సమయంలో ఒకరోజు మొత్తంలో 12గంటలు పగలు, 12గంటలు రాత్రి సమంగా ఉంటాయి. మార్చ్ లో వచ్చే విషవత్తును వసంత విషువత్తు లేదా మార్చ్ విషువత్తు అని అంటారు. అలాగే సెప్టెంబర్ లో వచ్చేదాన్ని సెప్టెంబర్ విషువత్తు లేదా శరదృతు విషువత్తు అంటారు. ఈ సంవత్సరం మార్చ్ విషువత్తు, మార్చ్ 20వ తేదీన సోమవారం వచ్చింది. దీన్ని చాలామంది ఒక పండగలా జరుపుకుంటారు. ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.
వసంత విషువత్తును ఏ దేశంలో ఎలా చేసుకుంటారంటే
మనదేశంలో విషువత్తుకు దగ్గరగా వచ్చే హోళీ పండగను ఆనందగా జరుపుకుంటారు. జపాన్ లో ఈరోజు హాలీడే ఉంటుంది. షున్ బున్ నోహి అనే పేరుతో జరుపుకునే ఈ పండగ కోసం 1948నుండి హాలీడే ఇస్తున్నారు. హరు నో హిగన్ అనే వారం రోజులు జరుపుకునే పండగ సమయంలో వసంత విషువత్తును మరో పండగలా జరుపుతారు. ఇరాన్ దేశస్తులు వసంత విషువత్తును కొత్త సంవత్సరం ఆరంభమైనట్లుగా జరుపుకుంటారు. గత 3వేల సంవత్సరాల నుండి ఈ ఆచారం అమల్లో ఉంది. మార్చ్ విషువత్తు తర్వాత వచ్చే పౌర్ణమి రోజును పండగలా చేసుకుంటారు క్రిస్టియన్స్. మెక్సికోకు చెందిన మయన్స్, కుకుల్కాన్ అనే పిరమిడ్ దగ్గర పడే నీడలను గమనిస్తుంటారు. ఆ నీడలు పాములా కనిపించడం అక్కడి ప్రత్యేకత.