Iron Deficiency: ఐరన్ లోపంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయా? ఈ ఆహారాలు తీసుకుంటే మంచిది!
శరీరానికి ఐరన్ ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. అయితే మారుతున్న ఆహార అలవాట్ల నేపథ్యంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఐరన్ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శీతా కాలంలో చాలామంది ఐరన్ లోపం సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇక వాతావరణంలోని తేమ పెరగడం కారణంగా చాలామందిలో రక్తహీనత సమస్యలొస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా కొన్ని ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కోడి మాంసం, వేట మాంసం ఉత్పత్తులు, సీ ఫుడ్స్, గుడ్లు, బీన్స్, బచ్చలి కూర, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్లు, ఐరన్ పోర్టిఫైడ్ తృణ ధాన్యాలు, బటానీలు వంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం నుంచి బయటపడవచ్చు
పాలకూరలో అధిక మోతాదులో ఐరన్
ముఖ్యంగా పాలకూరలో ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది. కావున ప్రతి రోజూ ఆహారాల్లో పాలకూరను అధికంగా తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా అధిక రక్తపోటుతో బాధపడేవారికి కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎర్రటి గింజలు కలిగిన దానిమ్మ పండ్లను ప్రతి రోజూ తింటే శరీరానికి అదనపు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని ఐరన్ ను పెంచే ఛాన్స్ ఉంది. ఇక రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దానిమ్మ ఉండే ఫైబర్, క్యాల్షియం, ప్రొటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యాపిల్ ప్రతి రోజూ ఉదయం పూట తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో షోషకాలు లభిస్తాయి.