Page Loader
Summer Fruits: వేసవిలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే.. 
వేసవిలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే..

Summer Fruits: వేసవిలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి కాలంలో శరీరం హైడ్రేటెడ్​గా ఉండేలా చూసుకోవడం అత్యంత అవసరం. అందుకే, హైడ్రేషన్‌ కోసం కొన్ని ప్రత్యేకమైన పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. పుచ్చకాయ: ఈ పండు సుమారు 91 శాతం వరకు నీటిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తక్కువ కాలరీలతో కూడిన ఆరోగ్యకరమైన పండు. శరీరానికి అవసరమైన పలు పోషకాలు ఇందులో లభిస్తాయి. కర్బూజ: దాదాపు 90 శాతం వరకు నీటితో కూడిన ఈ పండు మంచి ఫైబర్‌ సోర్స్‌ కూడా. దీనిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది మరియు మరబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

వివరాలు 

పైనాపిల్: 

విటమిన్ సీ అధికంగా ఉండే ఈ పండు దాదాపు 86 శాతం నీటిని కలిగి ఉంది.ఇందులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని కణాలను నష్టపోకుండా రక్షించగలవు. పనసపండు: పనస పండులో సుమారు 76 శాతం వరకు నీరు ఉంటుంది.ఇది బీ-కాంప్లెక్స్ విటమిన్లకు మంచి మూలం. శక్తిని ఇస్తూ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. జామకాయ: ఇందులో 80 శాతం వరకు నీరు ఉంటుంది. అదేవిధంగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలూ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి ఉత్తమ ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడతాయి. ద్రాక్ష పండ్లు: ఈ పండ్లు దాదాపు 81 శాతం నీటిని కలిగి ఉంటాయి.అలాగే విటమిన్ A,విటమిన్ C, ఎలక్ట్రోలైట్లు,యాంటీఆక్సిడెంట్స్ అధికంగా లభిస్తాయి.ఇవి శరీరాన్ని చురుకుగా ఉంచే పనిలో ఉపయోగపడతాయి.