
Ancient Sunscreen: 41,000 సంవత్సరాల క్రితం సన్‌స్క్రీన్‌లు ఉండేవా? షాకింగ్ కి గురిచేసే ఆధారాలు లభ్యం!
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి ఎండ తీవ్రత నుంచి మన చర్మాన్ని కాపాడుకునేందుకు మనం తరచూ సన్‌స్క్రీన్‌లను వాడుతుంటాం.
ఇవి ఆధునిక జీవనశైలిలో భాగంగా, కార్పొరేట్ సంస్కృతిలో, కాస్మెటిక్ కంపెనీల ప్రమోషన్ల వలన వాడుకలోకి వచ్చాయని వచ్చిందని చాలామంది భావిస్తుంటారు.
కానీ తాజా పరిశోధన ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెలికితీసింది. దీని ప్రకారం మన పూర్వీకులు ఇప్పటికే వేల ఏళ్ల క్రితమే సన్‌స్క్రీన్‌కు సమానమైన పదార్థాలను వాడుతున్నట్టు తేలింది.
వివరాలు
సన్‌స్క్రీన్‌ను వాడిన పూర్వీకులు
మిచిగాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనంలో, ప్రాచీన కాలంలో జీవించిన హోమో సేపియన్స్ (Homo Sapiens) సూర్యరశ్ముల వల్ల కలిగే హానిని నివారించేందుకు సహజ పదార్థాలను ఉపయోగించారని తేలింది.
ఇవి బ్రాండెడ్ కాస్మెటిక్స్ లాంటివి కాదు, కానీ సహజంగా లభించే పదార్థాలతో శరీరాన్ని రక్షించుకునే విధంగా తయారుచేసేవాళ్లు.
వివరాలు
భూమి మీద మారిన అయస్కాంత పరిస్థితులు
ఈ అధ్యయనం ప్రకారం, సుమారు 41,000 సంవత్సరాల క్రితం భూమిపై అయస్కాంత క్షేత్రం బలహీనపడింది.
ఇది "లాస్‌చాంప్స్ ఎక్స్‌కర్షన్" (Laschamps Excursion) అనే ఘట్టంలో చోటుచేసుకుంది.
అప్పట్లో భూమి ఉత్తర ధృవం యూరోప్ వైపు మళ్లడంతో, అయస్కాంత రక్షణ కవచం కేవలం 10% మాత్రమే మిగిలింది.
ఫలితంగా సూర్యుని కాస్మిక్ కిరణాల ప్రభావం భూమిపై తీవ్రంగా కనిపించింది.
ముఖ్యంగా యూరోప్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి.
దీని వల్ల ప్రజలు చర్మంపై మంట, కళ్ళు సంబంధిత సమస్యలు, ఫోలేట్ లోపం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.
అప్పుడు వారు సూర్యకిరణాల హానిని తట్టుకునేందుకు ఏ చర్యలు తీసుకున్నారు అన్నది ఆసక్తికర విషయమే.
వివరాలు
గుహలు, బట్టలతో రక్షణ
శాస్త్రవేత్తల ప్రకారం, హోమో సేపియన్స్ ఆ కాలంలో ఎండ నుంచి రక్షించుకునేందుకు గుహల్లో నివసించటం ప్రారంభించారు.
గుహలలోని నీడ వారు సూర్యకిరణాల నుంచి దాదాపుగా రక్షణ పొందే మార్గంగా మారింది.
అదే సమయంలో వారు బట్టలు తయారుచేసుకోవడం, కుట్టడం నేర్చుకున్నారు.
ఈ బట్టలు చలికాలంలో వేడి కలిగించడమే కాకుండా ఎండ నుంచి కూడా రక్షణ ఇచ్చేవి.
వివరాలు
ఓచ్రె (Ochre) అనే సహజ పదార్థం వాడకం
ఓచ్రె అనే ఎరుపు రంగు సహజ ఖనిజాన్ని వారు తమ శరీరంపై రాసుకునే వారు.
ఇది ఇనుము ఆక్సైడ్‌తో తయారవుతుంది. ఈ పదార్థం సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడేది.
పరిశోధకుల అంచనాల ప్రకారం, ఇది కేవలం అలంకరణ కోసమే కాకుండా, ఆరోగ్య రక్షణ కోసమూ ఉపయోగించబడింది.
ఓచ్రె - సూర్యరశ్ముల నుంచి రక్షణిచ్చే పూర్వపు పదార్థం
ఓచ్రెను ఒక సన్‌స్క్రీన్ తరహా పదార్థంగా పరిగణించవచ్చు.
ఇది సూర్యుని యూవీ కిరణాలను అడ్డుకునే లక్షణాలతో ఉండటం వల్ల, చర్మానికి హానికరం కాకుండా కాపాడుతుంది.
ఇప్పటికీ కొన్నిచోట్ల ఆదివాసీ తెగలు ఓచ్రెను ఉపయోగిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వివరాలు
బట్టలు, ఓచ్రె - డబుల్ ప్రొటెక్షన్
చలి, ఎండ వాతావరణాల నుంచి రక్షణ పొందేందుకు హోమో సేపియన్స్ బట్టలు కుట్టడం నేర్చుకున్నారనే విషయం స్పష్టమవుతుంది.
అదే సమయంలో బట్టలు ధరించడం వల్ల వారికి శీతాకాలంలో వేడి లభించడమే కాకుండా, ఎండ తీవ్రత నుంచి రక్షణ కలిగింది. ఆహారం కోసం ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇవే వారిని రక్షించాయి.
ఆధునిక సన్‌స్క్రీన్‌లతో పోలికలేదుగానీ...
యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌కు చెందిన మానవ శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ రేవెన్ గర్వే ప్రకారం, పూర్వకాలపు ఈ పదార్థాలు ఆధునిక బ్రాండెడ్ సన్‌స్క్రీన్‌లా కాకపోయినా, అవి సహజంగా తయారైనవి.
అందులోను అప్పట్లో ఆధునిక సాంకేతికత, ఫార్ములేషన్‌లు లేని సమయంలోనూ, మన పూర్వీకులు అందుబాటులో ఉన్న సహజ వనరులను తెలివిగా వినియోగించారని స్పష్టం అవుతుంది.