
Diabetes: డయాబెటిస్ ఉన్నవారుఈ ఆకును తిన్నారంటే.. షుగర్ సాధారణ స్థితి వచ్చేస్తుంది
ఈ వార్తాకథనం ఏంటి
కరివేపాకు అనేది భారతీయ వంటకాలలో సాధారణంగా ఉపయోగించే ఒక ఆకు, ఇది కేవలం ఆహారానికి రుచి, సువాసన కల్పించడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
క్రమం తప్పకుండా కరివేపాకును తీసుకోవడం ద్వారా శరీరం అనేక వ్యాధుల నుండి రక్షణ పొందుతుంది.
ఆయుర్వేదంలో, కరివేపాకు, చెట్ల బెరడులను అనేక రోగాల చికిత్సలో వాడతారు.సాంబార్, చట్నీ వంటి వంటకాలలో కరివేపాకును విరివిగా వాడతారు.
అయితే, చాలామంది కూరల్లో ఉన్న కరివేపాకును తీసేయడం చేస్తుంటారు, కానీ ఇది తింటే మధుమేహం బారిన పడే అవకాశం తగ్గుతుంది.
అలాగే, మధుమేహం ఉన్నవారు దీనిని ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
వివరాలు
కరివేపాకులో ఉన్న పోషకాలు
కరివేపాకు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, కాపర్, క్యాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం, ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి.
వీటితో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి విటమిన్లు, అమైనో ఆమ్లాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
వివరాలు
డయాబెటిస్ కోసం ప్రయోజనం
కరివేపాకులు డయాబెటిస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులోని హైపోగ్లైసీమిక్ లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.
ప్రతి రోజూ కరివేపాకును తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిలుపుకుంటుందని తేలింది.
జీర్ణక్రియలో సహాయం
కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వలన అజీర్ణం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
వివరాలు
రక్తహీనత నివారణ
కరివేపాకులో ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తహీనతను తగ్గించడంలో మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి.
జుట్టు సంరక్షణ
కరివేపాకును తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల జుట్టు సమస్యను కూడా నివారించడంలో సహాయపడుతుంది.