
Makhana Kheer : దసరా ప్రత్యేక వంటకం 'మఖానా ఖీర్'.. కొవ్వు చాలా తక్కువ గురూ..
ఈ వార్తాకథనం ఏంటి
దసరా నవరాత్రి 2023ే పండుగ సమయంలో ప్రతి ఇంట్లో ఉండే కామన్ స్వీట్ డిజెర్ట్ ఖీర్. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు కలిగి ఉండే ఈ రెసిపిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేయాలంటే మాత్రం మఖానా ఖీర్ చక్కటి ఎంపిక.
దుర్గ నవరాత్రి వేళల్లో చాలా మంది ఉపవాసాలు పాటిస్తుంటారు. ఈ సమయంలో కొవ్వు తక్కువ ఉండే ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
రోజంతా ఉపవాసం ఉండటంతో శరీరం అలసిపోతుంది.ఈ కారణంగా ఒకేసారి ఎక్కువ తీపి, కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవడం ఏమంత మంచిది కాదు. ఇలాంటి సందర్భాల్లో మఖానా ఖీర్ ఉత్తమ ఎంపిక.
details
మఖానా ఖీర్ లో విటమిన్ బి, ఇ, కె లభిస్తాయి
బరువు తగ్గేందుకు మఖానాలు చక్కగా సహకరిస్తాయి. వీటిల్లోని ప్రోటీన్, ఫైబర్, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ లాంటి ఫోషకాలు ఉంటాయి.
ఇక విటమిన్స్ లల్లో విటమిన్ బి, ఇ, కె ఉండటం కొసమెరుపు. ఆరోగ్య రీత్యా మఖానాలు చాలా మేలు కలిగిస్తాయి. ఫలితంగా దీన్ని తమ డైట్లో జత చేసుకుంటారు.
ఫెస్టివల్ సమయాల్లో స్వీట్స్ తినకుండా ఉండలేం. ఈ మేరకు మఖానాతో చేసే ఖీర్ని ఎంజాయి చేయొచ్చు. ఈ ఆరోగ్యకరమైన రెసిపీని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.
రొటీన్ ఖీర్కి బదులుగా మఖానా ఖీర్ ఎలా తయారు చేసుకోవాలి. ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా.
details
మఖానా ఖీర్ తక్కువ కొవ్వున్న ఆహారం
కావాల్సిన పదార్థాలు
పాలు - 1లీటర్
మఖానా - పావుకప్పు
పంచదార - 2 టేబుల్ స్పూన్లు
పిస్తా పప్పులు - 2 టీస్పూన్లు
బాదం పప్పులు - 2 టీస్పూన్
ఏలకుల పొడి - 1 టీస్పూన్
ఎలా తయారు చేసుకోవాలంటే
ముందుగా గిన్నె తీసుకుని అందులో పాలు పోయాలి. అది కాగుతున్నప్పుడే మఖానాలను చిన్న ముక్కలుగా కోసి పాలల్లో వేసేయాలి.
పాలు బాగా మరిగి, గింజలు మెత్తబడే వరకు మూత లేకుండా ఉడకనివ్వాలి.అందులో చక్కెర వేసి బాగా తిప్పి పిస్తాలు, బాదం, యాలకుల పొడిని వేసి చక్కగా కలపాలి.దీంతో వేడి వేడి మఖానా ఖీర్ రెడీ.
ముఖ్యగమనిక : ఆహార నిపుణుల సలహా తీసుకున్నాకే ఈ ఆహారాన్ని వండాలి.