NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Romantic Places: మీ భాగస్వామితో వాలెంటైన్స్ డే రోజున సందర్శించాల్సిన రొమాంటిక్ ప్రదేశాలపై ఓ లుక్కేయండి!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Romantic Places: మీ భాగస్వామితో వాలెంటైన్స్ డే రోజున సందర్శించాల్సిన రొమాంటిక్ ప్రదేశాలపై ఓ లుక్కేయండి!
    మీ భాగస్వామితో వాలెంటైన్స్ డే రోజున సందర్శించాల్సిన రొమాంటిక్ ప్రదేశాలపై ఓ లుక్కేయండి!

    Romantic Places: మీ భాగస్వామితో వాలెంటైన్స్ డే రోజున సందర్శించాల్సిన రొమాంటిక్ ప్రదేశాలపై ఓ లుక్కేయండి!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 27, 2025
    03:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫిబ్రవరి నెలను ప్రేమ మాసంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ నెలలో వాలెంటైన్స్ డే జరుపుకుంటారు.

    ప్రేమ పక్షులు వాలెంటైన్స్ వీక్‌లో తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఈ కాలాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ కారణంగా జంటలు ఈ నెలలో రొమాంటిక్ హాలిడే ట్రిప్‌లు ప్లాన్ చేసుకుంటారు.

    మీరు కూడా మీ భాగస్వామితో ఫిబ్రవరిలో ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే, ప్రేమపూర్వకంగా గడపడానికి మనదేశంలో ఉన్న కొన్ని ఉత్తమ ప్రదేశాలను మీకోసం అందిస్తున్నాం.

    1) మహాబలేశ్వర్

    మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కూడా ఫిబ్రవరిలో సందర్శించదగిన మరొక ఉత్తమమైన ప్రదేశం.

    పర్వతాలు, జలపాతాలు, సరస్సులు, పచ్చని లోయలు ఇవి ఈ ప్రదేశానికి ప్రత్యేకతను చేకూరుస్తాయి. జంటలు వీకెండ్ ట్రిప్‌లు ప్లాన్ చేసుకునేందుకు ఇదొక అద్భుతమైన గమ్యస్థానం.

    Details

    2) డార్జిలింగ్ 

    పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, ఫిబ్రవరిలో సందర్శించదగిన అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ ప్రదేశం ప్రత్యేకంగా తేయాకు తోటలతో, పచ్చటి ప్రకృతితో అలరారుతుంది.

    టైగర్ హిల్ నుంచి కనిపించే దృశ్యాలు, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలోని సొగసైన ట్రిప్, అన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని మరింత రొమాంటిక్‌గా మారుస్తాయి.

    మీ భాగస్వామితో కలిసి ఈ పచ్చని అందాలను ఆస్వాదించి, మధురమైన క్షణాలను గడపవచ్చు.

    3) గోవా

    గోవా పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే బీచ్‌లు, సాంస్కృతిక వంటకాలు, సముద్రతీరం అందాలు ఇవి ఫిబ్రవరిలో గోవాను సందర్శించడానికి ఉత్తమ ప్రదేశంగా నిలబెడతాయి.

    మీ భాగస్వామితో గోవాలోని బీచ్‌లలో ఆనందంగా గడపొచ్చు. గోవాలోని ఈ ఆహ్లాదకర వాతావరణంలో మీ ప్రేమను మరింత నింపుకోండి.

    Details

    4) హంపి 

    యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాప్రసిద్ధిగాంచిన హంపి, ఫిబ్రవరిలో జంటల కోసం ఆదర్శవంతమైన గమ్యస్థానం.

    ఇది పురాతన దృశ్యాలతో అలరారుతుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

    అరటితోటలు, కొండ చరియలతో కూడిన ఈ ప్రదేశం పురాతన చారిత్రక గమ్యస్థానానికి కూడా ప్రతీక. నాలుగైదు రోజుల విహారానికి హంపి అనువైనది.

    5) ఉదయపూర్

    రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ ప్రేమ పక్షులకు రొమాంటిక్ ట్రిప్‌లకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. సరస్సుల నగరం అని పిలుచుకునే ఈ ప్రాంతం రాజభవనాలు, హవేలీలతో పాటు నీటి అందాలను చూసి మైమరిపోవచ్చు.

    ఉదయపూర్‌లో మీ భాగస్వామితో గడిపిన ప్రతి క్షణం మీ జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది.

    ఈ ప్రదేశాలు ఫిబ్రవరిలో ప్రేమ మాసాన్ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి మీకోసం సిద్ధంగా ఉన్నాయి

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాలెంటైన్స్ డే
    మహారాష్ట్ర
    గోవా

    తాజా

    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    వాలెంటైన్స్ డే

    NailTrends: వాలెంటైన్స్ డే కోసం అందమైన నెయిల్ ఆర్ట్ ఐడియాస్ లైఫ్-స్టైల్

    మహారాష్ట్ర

    PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ నరేంద్ర మోదీ
    Maharashtra New CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం మూడు పార్టీల పోటీ.. నేడే తుది నిర్ణయం ఇండియా
    Nana Patole: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరాజయం.. కాంగ్రెస్ చీఫ్ పదవికి నానా పటోలే రాజీనామా  భారతదేశం
    Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్ భారతదేశం

    గోవా

    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి మహారాష్ట్ర
    TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన ఆటో మొబైల్
    షాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్ విహారం
    పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు ఎన్ఐఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025