
వర్షాకాలం: కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితం అవుతుంటుంది. కలుషితమైన నీటిని వాడటం వల్ల అనేక రోగాలు వ్యాపిస్తాయి. అందుకే తాగునీరు, అవసరాల కోసం వాడే నీటిని కలుషితం కాకుండా చూసుకోవాలి.
ప్రస్తుతం కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం.
టైఫాయిడ్:
కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం కారణంగా బ్యాక్టీరియం సాల్మోనెల్లా టైఫి అనే బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి టైఫాయిడ్ వ్యాధికి కారణమవుతుంది.
అధిక జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి వంటి లక్షనాలు టైఫాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో కనిపిస్తాయి.
టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే కలుషితం కాని ఆహారం, నీళ్ళు తీసుకోవాలి. చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటిస్తుంటే టైఫాయిడ్ రాకుండా కాపాడుకోవచ్చు.
Details
మరణానికి దారి తీసే మలేరియా
కలరా:
పరిశుభ్రత లేని ప్రదేశాల్లో నివసించే వారికి కలరా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా, కండరాలు పట్టేయడం, వాంతులు, నీళ్ళ విరేచనాలు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి.
కలరా రాకుండా ఉండాలంటే కలుషితమైన నీటిని, వండని ఆహారాలను, సగం ఉడికిన ఆహారాలను తినకూడదు. క్రమం తప్పకుండా చేతులను శుభ్రపరుస్తూ ఉండాలి.
మలేరియా:
వర్షాకాలంలో మలేరియా వ్యాప్తి ఎక్కువగానే ఉంటుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు కారణంగా మలేరియా వ్యాపిస్తుంది. వస్తూ పోయే జ్వరం, చలి, జలుబు లక్షణాలు కనిపిస్తాయి.
మలేరియా మరీ తీవ్రమైతే అవయవాలు పాడైపోయి మరణం సంభవించవచ్చు. దోమలకు నివాసం ఏర్పడకుండా ఇంటి చుట్టుపక్కలను శుభ్రంగా ఉంచుకోవాలి.
Details
హెపటైటిస్-ఏ:
కలుషితమైన ఆహారం తీసుకోవడం, హెపటైటిస్-ఏ వ్యక్తితో క్లోజ్ గా ఉండడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధి.
అలసట, పచ్చకామెర్లు, వికారం, వాంతులు, కాలేయ భాగంలో కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, సడెన్ గా జ్వరం రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ వేసుకోవడం ఉత్తమం.