వర్షాకాలంలో మీ పెంపుడు కుక్కపిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి చేయాల్సిన పనులు
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాకాలం వచ్చినపుడు మీరు మాత్రమే కాదు మీరు పెంచుకునే జంతువులను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో పెంపుడు జంతువులకు పిడుదు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.
కలుషితమైన నీరు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జీర్ణసమస్యలు పెంపుడు జంతువులలో పెరుగుతాయి. ప్రస్తుతం పెంపుడు కుక్కపిల్లలను వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుందాం.
పిడుదు పురుగుల బెడద నుండి తప్పించాలి:
మీ కుక్కపిల్లను పిడుదు పురుగులు ఉండే ఏరియాలోకి వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి. పిడుదు పురుగుల నుండి రక్షణ కావాలంటే వేపనీళ్ళతో స్నానం చేయించాలి.
కలుషితమైన నీటికి దూరంగా ఉంచండి:
వర్షాకాలంలో రోడ్డు మీద నిల్వ ఉండే నీటిని మీ కుక్కపిల్లలు తాగకుండా చూసుకోండి. ఆ నీటిలోని క్రిముల కారణంగా కుక్కపిల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
Details
కుక్కపిల్లల కోసం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు
రెయిన్ కోట్ వేయండి:
కుక్కపిల్లలను ఖచ్చితంగా సాయంత్రాలు బయటకు తీసుకెళ్ళాలి. అయితే వర్షం పడుతుంటే గనక రెయిన్ కోట్, షూస్ వంటివి వేయడం మర్చిపోవద్దు. మార్కెట్లో కుక్కపిల్లల కోసం కావాల్సినవన్నీ దొరుకుతాయి.
పోషకాలున్న ఆహారం అందించండి:
వర్షాకాలంలో మనుషుల్లోనే కాదు కుక్కపిల్లలోనూ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి ఫైబర్, కాల్షియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఉన్న ఆహారాలను అందించండి. ప్యాక్ చేసిన ఆహారాలు కాకుండా ఇంట్లో వండిన ఆహారాలు పెడితే బాగుంటుంది.
వర్షాకాలానికి ముందే వ్యాక్సిన్:
వర్షాకాలంలో వచ్చే రోగాల నుండి కుక్కపిల్లను కాపాడాలంటే వర్షాకాలం రాకముందే వ్యాక్సిన్ వేయడం ఉత్తమం. దీనివల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు కుక్కపిల్లలకు సోకకుండా ఉంటుంది.