Page Loader
ఏటా సెప్టెంబర్ 5నే ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారో తెలుసా
ఏటా సెప్టెంబర్ 5నే ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారో తెలుసా

ఏటా సెప్టెంబర్ 5నే ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 04, 2023
06:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏటా సెప్టెంబర్ 5న భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని స్మరించుకుంటూ ప్రతీ సంవత్సరం దేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. సుప్రసిద్ధ పండితుడు, ఉపాధ్యాయుడు, విద్యావేత్త అయిన సర్వేపల్లి పుట్టినరోజునే ఏటా సెప్టెంబర్ 5న టీచర్స్ డేగా జరుపుకుంటారు. 1962 సెప్టెంబరు 5న తొలిసారిగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. డా. రాధాకృష్ణన్‌ను చాలా మంది విద్యార్థులు ఆరాధించేవారు. 1962లో ఆయన రాష్ట్రపతి అయ్యాక సెప్టెంబర్ 5ను రాధాకృష్ణన్ డేగా జరుపుకోవాలని కోరారు. ఈ మేరకు సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటేనే తనకు గర్వకారణమని సర్వేపల్లి బదులిచ్చారు. అలా మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని భారతదేశంలో 1962 సెప్టెంబర్ 5న జరుపుకోవడం గమనార్హం.

DETAILS

భారతరత్నతో పాటు నైట్‌హుడ్ అందుకున్న సర్వేపల్లి 

తమిళనాడులోని తిరుత్తణిలోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో సెప్టెంబర్ 5, 1882న సర్వేపల్లి జన్మించారు. ఈ మేరకు భారత మొదటి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతిగా కీర్తి గడించారు. ఆయన MA, D.Litt, LL.D., DCL, Litt.D., DL, FRSL, FBA, లాంటి ఎన్నో డిగ్రీలను సాధించాడు. ఎన్నో పుస్తకాలను రచించిన సర్వేపల్లి, 1918లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఫిలాసఫీ పేరుతో సాహిత్య రచనలను పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీతో పాటు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (1939-48) వైస్-ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తించారు. విద్యవ్యాప్తికి ఆయన చేసిన కృషికి 1931లో భారతరత్నతో పాటు నైట్‌హుడ్ లభించింది. 27 సార్లు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. స్వాతంత్రం తర్వాత UNESCO (1946-52)లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు.