వీధి వ్యాపారీ ముఖంలో చిరునవ్వు తెప్పించిన కళాకారుడు: వీడియో వైరల్
కొన్నిసార్లు జరిగే చిన్న ఘటనలు మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. జీవితాన్ని బీజీగా గడుపుతున్న సమయంలో కొన్ని చిత్రాలను చూసినప్పుడు మనసుకు ఆనందం కలుగుతుంది. అలాగే బెంగళూరులో ఆలూ బోండాలు తయారు చేస్తున్న ఓ వీధి వ్యాపారీ ముఖంలో ఓ కళాకారుడు సంతోషాన్ని నింపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బెంగళూరులోని ఓ చిన్న వీధిలో ఓ వృద్ధుడు కష్టపడి అలూ బొండాలు చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడి వెళ్లిన కళాకారుడు మనోజ్ అతని దగ్గరి వెళ్లి బొండాలను కొనుగోలు చేస్తాడు. అయితే వాటిని తింటున్న సమయంలోనే అతని వైపు చూస్తూ ప్రొర్టెయిట్ తో అద్భుతంగా అతని చిత్రాన్ని గీసి వృద్ధుడికి చూపించాడు.
సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
ఆ వీడియోను చూసిన ఆ వృద్ధుడి ముఖంలో ఒక్కసారిగా చిరునవ్వు వచ్చింది. దీంతో ఆ చిరునవ్వు తన మనసును తాకిందని మనోజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. వృద్ధుడి చిత్రాన్ని తన టాబ్లెట్ లో మనోజ్ అచ్చం వృద్ధుడి ఎలా ఉంటాడో అలానే గీసి చూపించడం విశేషం. అయితే ఈ వీడియో పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది. నెటిజన్లు తాత ముఖంలో చిరునవ్వు తెప్పించనందుకు ధన్యావాదాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 2.1 మిలియన్లు గా వ్యూస్ వచ్చాయి.