
ఎయిడ్స్ రావడానికి కారణాలివే.. ఈ వైరస్ వచ్చిందని ఎలా తెలుస్తుందో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్ఐవీ ఎయిడ్స్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధిగా చెప్పొచ్చు. ఈ వ్యాధికి మెడిసిన్ లేదు.
చాలామంది దీని భారీన పడ్డా ఏండ్ల తర్వాతే తమకు ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తిస్తారు.
మొదట్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించకపోవడమే ఇందుకు కారణం. ముఖ్యంగా హెచ్ఐవీ ఉన్న వ్యక్తికి ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ వైరస్‌ను ఇతరులకు వ్యాప్తి చేయొచ్చు.
అసలు హెచ్ఐవీ ప్రబలడానికి గల కారణాల గురించి మనం తెలుసుకుందాం.
ఇండియాలో ఈ ఎయిడ్స్ వ్యాధిని మొదటిసారిగా 1986లో గుర్తించారు.
ఓరల్ సెక్స్ లో పాల్గొన్న వారికి హెచ్ఐవీ ఎయిడ్స్ వచ్చే అవకాశం ఎక్కవుగా ఉంటుంది.
ఎయిడ్స్ ఉన్న వ్యాధిగ్రస్తుడిని రక్తదానం వల్ల ఎయిడ్స్ వ్యాధి వ్యాపిస్తుంది
Details
హెచ్‌ఐవీ రావడానికి గల కారణాలు
హెచ్ఐవి సోకిన వ్యక్తితో సెక్స్ టాయ్స్‌ను పంచుకునే వ్యక్తులు
లైంగిక సంక్రమణ అంటువ్యాధులు, హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి చరిత్ర ఉన్న వ్యక్తులు
హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిని సూదిని ఉపయోగించిన వ్యక్తులు
చికిత్స చేయని హెచ్ఐవి ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు
ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్న వ్యక్తులు
అత్యాచారానికి గురైన వ్యక్తులు
వీర్యం, రుతుస్రావ రక్తం, యోని ద్రవాలు, చనుబాలు, రక్తం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.