Propose Day: ప్రేమికుల హృదయాలను గెలిచే రోజు.. ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే
ఈ వార్తాకథనం ఏంటి
వాలెంటైన్స్ డే వీక్‌లో ప్రత్యేకమైన రోజుల్లో ఒకటైన ప్రపోజ్ డేను ఫిబ్రవరి 8న జరుపుకుంటారు.
ప్రేమ ఎప్పుడూ, ఎక్కడా, ఎలా పుట్టిందన్న దానికంటే.. దాన్ని ఎలా వ్యక్తపరచామన్నదే ముఖ్యమైందని చెప్పొచ్చు. ప్రేమించే వ్యక్తిని ఎలా ఇంప్రెస్ చేశామన్నదే ఈ రోజు స్పెషల్.
ప్రతేడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. ఇది ప్రేమను ప్రకటించుకునేందుకు, మనసులోని భావాలను పంచుకునేందుకు అద్భుతమైన రోజు.
అయితే వాలెంటైన్స్ వీక్‌ను ప్రత్యేకంగా భారతదేశంలో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ప్రేమను వ్యక్తీకరించడం, ప్రియమైన వ్యక్తి మనసును గెలుచుకోవడం సులభమైన పని కాదు. నిజానికి, ప్రేమను ఒప్పించడమంటే ఒక కళనే చెప్పాలి.
అందుకే లవ్ బర్డ్స్ ప్రపోజ్ డే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.
Details
ప్రేమను వ్యక్తపరచడానికి మార్గాలు అనేకం
ప్రేమ అనుభూతి మాటల్లో చెప్పలేనిది, కానీ ప్రతి ఒక్కరూ దీనికి అతీతులు కాలేరు.
ఈ ప్రపోజ్ డే రోజున, మన హృదయంలోని ప్రేమను వ్యక్తపరచడానికి అనేక మార్గాలున్నాయి.
ప్రియమైన వారికి ఇష్టమైన వాచ్, రింగ్ లేదా ఏదైనా ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వడం ద్వారా మన ప్రేమను వ్యక్తం చేయవచ్చు.
లేదా మంచి కవిత రాసి తమపై మన ప్రేమను తెలియజేయవచ్చు.
మీరు ఒక ఆర్టిస్ట్ అయితే, వారి పోర్ట్రయిట్ గీసి అందించి ఎందుకు ప్రత్యేకమైన వారో వివరించి చెప్పొచ్చు.
Details
సర్‌ప్రైజ్ గిఫ్ట్ తో ప్రేమను వ్యక్తపరిచాలి
ఇంకా క్రియేటివ్‌గా, మీకు నచ్చిన సినిమా పాటను కోట్ చేస్తూ వాట్సాప్ మెసేజ్ ద్వారా ప్రేమను వ్యక్తపరచవచ్చు.
ఎంత ఆలస్యం చేస్తున్నా, భావాలను బంధించకుండా, ఈ ప్రత్యేకమైన రోజును ఆస్వాదించండి.
ప్రపోజ్ డే సందర్భంగా, ప్రేయసి లేదా ప్రియుడికి ఎర్ర గులాబీ ఇచ్చి భావాలను తెలియజేయడం ఒక సాధారణ పద్ధతి.
అదేవిధంగా, ప్రేమను ప్రదర్శించేందుకు గిఫ్ట్ కార్డులు, చాక్లెట్లు, టెడ్డీ బియర్స్ ఇవ్వడం కూడా కామన్.
అయితే ప్రేమను ఓ ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌గా ప్రకటించడం మరింత మధురంగా మారుతుంది.
Details
ఫిబ్రవరి 9న చాక్లెట్ డే
అవతలి వ్యక్తి అభిరుచులకు తగ్గట్లు, ఊహించని విధంగా ప్రేమను వ్యక్తం చేస్తే మరింత రొమాంటిక్‌గా మారుతుంది.
ప్రేమకు సంబంధించిన ఈ ఎమోషనల్ మూమెంట్‌ను ఎంతో స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రేమికులు.
వాలెంటైన్స్ వీక్‌లో మూడో రోజు ఫిబ్రవరి 9న చాక్లెట్ డే, నాలుగో రోజు ఫిబ్రవరి 10న టెడ్డీ డే జరుపుకుంటారు.
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 11న ప్రామిస్ డే, ఫిబ్రవరి 12న హగ్ డే, ఫిబ్రవరి 13న కిస్ డే జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ప్రతి రోజు ప్రేమను వ్యక్తం చేసేందుకు ప్రత్యేకమైనదే!