Common Diseases In Summer: వేసవిలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం.. ఆరోగ్యాన్ని రక్షించేందుకు అనుసరించాల్సిన చిట్కాలివే
ఈ వార్తాకథనం ఏంటి
ఏటా ప్రకృతిలో చోటుచేసుకునే మార్పుల కారణంగా వేసవి తాపం క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభంలోనే ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
సాధారణంగా ఏప్రిల్‌లో ఉండే ఉష్ణోగ్రతలు, మార్చి మొదలుకాకముందే నమోదవుతున్నాయి. దీనివల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ వేడి మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపనుంది? వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి? డీహైడ్రేషన్ నుంచి ఫుడ్ పాయిజనింగ్ వరకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
సూర్యుని అతినీలలోహిత కిరణాల ప్రభావం తగ్గించుకునే మార్గాలపై అవగాహన కలిగి ఉండటం అవసరం.
Details
వేసవిలో ఎదురయ్యే ప్రధాన ఆరోగ్య సమస్యలు
1. ఫుడ్ పాయిజనింగ్
వేసవిలో ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు చాలా సాధారణం. హానికారక బ్యాక్టీరియా, పరాన్నజీవుల వృద్ధికి వేడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
వండిన ఆహారాన్ని బయట వేడిలో ఉంచితే, బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ సమస్యను నివారించేందుకు తాజా ఆహారాన్ని తినడం, మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో భద్రపరచడం ముఖ్యం.
మసాలా ఆహారాన్ని తగ్గించడం కూడా ఫుడ్ పాయిజనింగ్ ముప్పు తగ్గించవచ్చు.
2. డీహైడ్రేషన్
వేసవిలో అధిక చెమట వల్ల శరీరంలో నీరు, లవణాలు తగ్గిపోతాయి. దీని వల్ల నీరసం, బలహీనత, మైకం వంటి సమస్యలు తలెత్తుతాయి.
రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగడం అనివార్యం. ఆల్కహాల్, కెఫైన్ వంటి పానీయాలను తగ్గించటం హైడ్రేషన్‌కు సాయపడుతుంది.
Details
3. సన్ బర్న్
వేసవిలో దీర్ఘకాలం సూర్యకాంతికి గురికావడం వల్ల చర్మంపైUVకిరణాల ప్రభావం పడుతుంది. దీని వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబారడం, దురద వంటి సమస్యలు ఏర్పడతాయి.
తీవ్రమైన స్థాయిలో వాంతులు, జ్వరం, జలుబు వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.
సన్ బర్న్ నివారించేందుకు SPF 15 లేదా అంతకంటే ఎక్కువ ఉండే సన్ స్క్రీన్‌ను వాడటం అవసరం.
4. కంటి ఇన్ఫెక్షన్
వేసవిలో ఎక్కువగా కంటి అలర్జీలు, కంజక్టివైటిస్, కంటి వాపు లాంటి సమస్యలు కనిపిస్తాయి. కళ్లను క్రమం తప్పకుండా శుభ్రమైన నీటితో కడుక్కోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
5. హీట్ స్ట్రోక్
గత కొన్ని సంవత్సరాలుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో హీట్ స్ట్రోక్ బాధితుల సంఖ్య పెరుగుతోంది.
Details
హీట్ స్ట్రోక్ లక్షణాలు
అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో వేడిమి పెరగడం
గుండె కొట్టుకునే వేగం మారడం
శ్వాసకోశ సమస్యలు తలెత్తడం
6. తలనొప్పి
వేసవి వేడి వల్ల తలనొప్పి చాలా మందికి ఎదురయ్యే సమస్య.
ఇది అధిక ఉష్ణోగ్రతకు శరీరం ప్రతిస్పందించడం వల్ల తలెత్తుతుంది. తరచుగా నీరు తాగడం, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం తలనొప్పి నివారణకు ఉపయోగకరం.
Details
వేసవిలో ఆరోగ్య సమస్యల నివారణకు చిట్కాలు
రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగండి. నిమ్మకాయ రసంతో తరిగిన ద్రావణాలు, మజ్జిగ, నారింజ, దానిమ్మ రసాలను తాగడం మంచిది.
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు దాహార్కమైన ఎండలో బయటకి వెళ్లకండి. సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించి చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షించుకోండి.
కూలింగ్ గ్లాసులు ధరించి కళ్లను రక్షించుకోండి. తేలికపాటి, లేత రంగు 'కాటన్ దుస్తులు' ధరించడం వల్ల వేడి నుంచి రక్షణ పొందవచ్చు.
బయట ఆహారం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వేసవిలో ఆహారం త్వరగా పాడవుతుంది.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి, ప్రయాణాల సమయంలో తగినంత నీరు తీసుకెళ్లడం మర్చిపోవద్దు.