Ugadi 2025: ఈ ఏడాది ఉగాది సంవత్సరం కొత్త పేరు ఏమిటో తెలుసా? ఆసక్తికరమైన విశేషాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఉగాది మనకు తొలితెలుగు పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగ చైత్రమాసంలోని తొలి రోజున జరుపుకుంటారు.
సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలోనే ఈ పండుగ వస్తుంది. 2025లో మార్చి 30న ఉగాది జరుపుకోబోతున్నాం.
"యుగాది" అనే పదం నుండి "ఉగాది" రూపు దాల్చింది. "యుగ" అంటే కాలం, "ఆది" అంటే ప్రారంభం.
దీని అర్థం నూతన సంవత్సర ప్రారంభం అని భావించబడుతుంది. మన తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన నామంతో పేరుపెడతారు.
2024లో క్రోధినామ సంవత్సరాన్ని జరుపుకున్నాం, 2025లో విశ్వావసు నామ సంవత్సరంతో ఉగాదిని స్వాగతించబోతున్నాం.
వివరాలు
భిన్న రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు
ఉగాది పండుగను కేవలం తెలుగు ప్రజలే కాకుండా, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా తమ భాషా, సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా జరుపుకుంటాయి.
మహారాష్ట్రలో దీనిని "గుడిపడ్వా" అని పిలుస్తారు. బెంగాల్‌లో "పోయిలా భైశాఖి", పంజాబ్‌లో "వైశాఖి", మలయాళీలు "విషు" పేరుతో జరుపుకుంటారు.
ఈ విధంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగాది ప్రత్యేక వేడుకలతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
వివరాలు
ఉగాది ముందు..
ఉగాది సమీపిస్తుందంటే ముందుగా ఇంట్లో శుభ్రపరిచే పనులు ప్రారంభమవుతాయి.
ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తారు.మామిడి ఆకులతో తోరణాలు కడతారు.కుటుంబ సభ్యులు కొత్త బట్టలు ధరిస్తారు.
పండుగ నాడు ప్రత్యేకమైన వంటలు తయారు చేస్తారు.
ఉగాది ప్రత్యేకత -
ఉగాది పచ్చడి ఈ పండుగకు ఉగాది పచ్చడికి ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఈ పచ్చడిలో ఆరో రుచులు ఉంటాయి:
తీపి (బెల్లం)-ఆనందాన్ని సూచిస్తుంది.
పులుపు (చింతపండు)-అనుభవాల తీయదనాన్ని తెలియజేస్తుంది.
చేదు (నిమ్మరసం/వేప పూత)-జీవితం ఎదురు చేసే కఠిన పరిస్థితులను గుర్తుచేస్తుంది.
ఉప్పు - జీవన సమతుల్యతను సూచిస్తుంది.
కారం (మిరప) - శక్తి, ఉత్సాహాన్ని పెంచుతుంది.
వగరు (మామిడి ముక్కలు) - కొత్త అవకాశాలను సూచిస్తుంది.
వివరాలు
ఉగాది పండుగ విశిష్టత
ఈ రోజున కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి శుభ ఫలితాలను కోరుకుంటారు.
పంచాంగ శ్రవణం చేయించడం ద్వారా కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, భవిష్యత్ సూచనలను తెలుసుకుంటారు.
చాలామంది కొత్త కార్యాలను ఉగాది రోజు ప్రారంభించడం శుభప్రదమని భావిస్తారు.
ఈ విధంగా ఉగాది మన సంప్రదాయాలకు ప్రతీకగా, కుటుంబ సభ్యుల కలయికకు, పౌరాణిక విశ్వాసాలకు ప్రతిబింబంగా నిలుస్తుంది.
ఈ ఉగాది మీ కుటుంబానికి శుభ సమృద్ధిని తేవాలని ఆకాంక్షిస్తూ..!