Cool Drinks in Summer: వేసవికాలంలో కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా? జాగ్రత్త..!
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి కాలంలో చల్లదనాన్ని కోరుకుని మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్‌ను ఆనందంగా తాగేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి.
ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని ముప్పు తీసుకొస్తున్నామన్న విషయాన్ని గుర్తించాలి.
సాధారణంగా కూల్‌డ్రింక్స్ ఏ కాలంలోనైనా లభించవచ్చు, అయితే వేసవిలో వీటి వినియోగం మరీ ఎక్కువగా ఉంటుంది.
మనలో చాలా మంది కూల్‌డ్రింక్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. ఎండాకాలంలో ఎక్కువ దాహం ఉండటం వల్ల వీటిని తాగడం అలవాటుగా మారిపోతుంది.
అయితే, దాహం తీరినప్పటికీ దీని ప్రభావం శరీరంపై తీవ్రంగా పడుతుంది. ముఖ్యంగా శరీర బరువు పెరుగుదల అనేది ప్రధాన సమస్యగా మారుతుంది.
వివరాలు
కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు!
కూల్‌డ్రింక్స్ అధిక మొత్తంలో కేలరీలు, చక్కెరను కలిగి ఉంటాయి.
దీని వల్ల డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వారు కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండటం ఉత్తమం.
వీటిలో అధికంగా ఉండే సోడా శరీరానికి హాని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, ఫలితంగా త్వరగా ఆకలి వేస్తుంది.
ఎక్కువగా తినే అలవాటు పెరిగి, అనవసరంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది.
వివరాలు
రసాయనాలతో నిండిన కూల్‌డ్రింక్స్
వీటిలో ఉపయోగించే రసాయనాలు శరీరానికి హానికరం. కొన్ని ప్రయోగాల్లో కూల్‌డ్రింక్స్‌ను సింక్ శుభ్రం చేసేందుకు కూడా ఉపయోగించడాన్ని మనం చూశాము. అంటే ఇవి యాసిడ్‌కి సమానంగా పని చేస్తాయన్న మాట.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు
కూల్‌డ్రింక్స్ తాగాలనుకునే ప్రతి సారి, వాటికి బదులుగా శుద్ధమైన నీరు లేదా తాజా ఫలహార జ్యూస్‌ను తీసుకోవడం మంచిది.
ఇది ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, శరీరానికి తగిన పోషకాలను అందిస్తుంది. ఇప్పటికైనా ఈ శీతలపానీయాల వినియోగాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి!