ఇండియాలో ఈ జిమ్ సెంటర్స్ చాలా పాపులర్.. అవేంటో తెలుసుకుందామా!
వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఒక రోజులో కనీసం 30నిమిషాలైనా వ్యాయామం చేయాలని చెబుతారు. వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో, వ్యాయామం చేసే ప్రదేశం బాగుండడం అంతకన్నా ముఖ్యం. ఇండియాలో చెప్పుకోదగిన జిమ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. అక్కడి పరికరాలు, వాతావరణం వ్యాయామం మీద ఆసక్తిని తీసుకొస్తాయి. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ పాపులరిటీ తెచ్చుకున్న కొన్ని జిమ్ సెంటర్ల గురించి తెలుసుకుందాం. కల్ట్ ఫిట్ (Cult.fit): దీన్ని ముఖేష్ బన్సల్ స్థాపించారు. ఇక్కడ వ్యాయామంతో పాటు యోగ, బాక్సింగ్ కూడా ఉంటుంది. అంతేకాదు ఈ జిమ్ సెంటర్ కు సంబంధించిన cure.fit అనే యాప్ కూడా అందుబాటులో ఉంది.
5000ఫ్రాంఛైజీలు ఉన్న జిమ్ సెంటర్
ఎనీటైమ్ ఫిట్‌నెస్: ఈ జిమ్ సెంటర్ 24గంటలు అందుబాటులో ఉంటుంది. జిమ్ వెళ్ళడానికి మీకు సమయం కుదరకపోతే ఈ సెంటర్లో జాయిన్ కావచ్చు. అమెరికాకు చెందిన ఈ జిమ్ సెంటర్ సంస్థకు 50దేశాల్లో 5000ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ఫిట్నెస్ ఫస్ట్ (Fitness first): ఇది 1993లో మొదలైంది. దీని హెడ్ క్వార్టర్స్ యునైటెడ్ కింగ్ డమ్ లో ఉంది. ఈ సెంటర్ లో వర్కౌట్స్ చేయడానికి అనువైన అన్ని పరికరాలు అందుబాటులో ఉంటాయి. గోల్డ్స్ జిమ్(Gold's gym): ఈ కంపెనీ జిమ్ సెంటర్స్ మీకు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో కనిపిస్తాయి. ఇక్కడ పర్సనల్ ట్రైనర్ ఉంటారు. ఇంకా రెగ్యులర్ గా వర్క్ షాప్స్ జరుగుతూ ఉంటాయి.