ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి ప్రింటెండ్ దేవాలయం.. ఎక్కడుందో తెలుసా..!
తెలంగాణలో ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెండ్ దేవాలయం నిర్మతమైంది. వాస్తుశిల్ప సౌందర్యం, సాంకేతిక పరిఙ్ఞానంతో సిద్దిపేటలో శ్రీపాద కార్యసిద్ధేశ్వర స్వామి దేవస్థాన్ని నిర్మించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ హిందూ దేవాలయంగా నిలిచింది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్‌తో కలిసి అప్సుజా ఇన్ ఫ్రాటెక్ ఆధ్వర్ంలో సిద్దిపేటలోని చార్విత మెడోస్‌లో ఈ వినూత్న ఆలయాన్ని ప్రారంభించారు. దేవాలయ ప్రారంభోత్సవానికి అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ హరి కృష్ణ జీడిపల్లి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ ఘూలే, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వసీం చౌదరి హజరయ్యారు.
నవంబర్ 24న నుంచి భక్తులకు దర్శన భాగ్యం
35.5 అడుగుల పొడవు, 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అలయాన్ని నిర్మించారు. ఇక ప్రతిష్టాపన పూర్తియైన తర్వాత నవంబర్ 24న నుంచి భక్తుల సందర్శన కోసం అందుబాటులో ఉంటుంది. సిద్దిపేటలోని చర్విత మెడోస్‌లో 3డిలో నిర్మించిన హిందూ దేవాలయం మన అంకిత భవానికి నిదర్శమని అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి పేర్కొన్నాడు. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి ఆలయమని చీఫ్ ఆఫరేటింగ్ అధికారి అమిత్ ఘూలే చెప్పాడు. కాన్సెప్ట్ సరిహద్దులు, ఎత్తైన ప్రాంతాలు, డెజర్ట్‌లు, మంచుతో నిండిన ప్రాంతాల వంటి అగమ్య ప్రాంతాలలో సింప్లిఫోర దృఢమైన సిస్టమ్‌ల భవిష్యత్తు అప్లికేషన్‌లకు వేదికగా నిలుస్తుందన్నారు.