
Dates in Winter: చలికాలంలో ఖర్జూరం తింటే కలిగే లాభాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలంలో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడతారు. వీటి నుంచి బయటపడటానికి చాలా మార్గాలను అన్వేషిస్తుంటారు.
అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే సీజనల్ వ్యాధుల నుంచి బయట పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.
అందులో ఉన్న వేడి స్వభావం కారణంగా శరీరాన్ని వెచ్చగా ఉండటంలో సాయపడుతుంది.
ఇక చలికాలంలో ఖర్జూరాలు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.
వీటిలో ఐరన్, కాల్షియం, మినరల్స్, ఫాస్పరస్, అమినో యాసిడ్స్ వంటివి వీటిలో అధికంగా ఉంటాయి.
Details
ఖర్జూరంతో మలబద్దకం సమస్యలు దూరం
ఖర్జూరం తినడం వల్ల జలుబు, దగ్గు సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే రోజూ రెండు, మూడు ఖర్జూరాలను పాలలో కలిపి తింటే జలుబు, దగ్గు ఉపశమనం లభిస్తుంది.
ఖర్జూరాలతో జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో తగినంత మొత్తంలో పీచు లభించడంతో మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
ఖర్జూరాన్ని రోజు తీసుకుంటే మొకాళ్ల నొప్పు ల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది.
ఇందులో క్యాల్షియం, సెలీనియం, మాంగనీస్, మైదలైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు ఎముకలను దృఢంగా ఉంచేందుకు సాయపడుతుంది.