Page Loader
Christmas Gift Ideas : క్రిస్మస్‌కి ఇవ్వదగ్గ బెస్ట్ గిఫ్ట్స్ ఇవే.. అన్నీ తక్కువ బడ్జెట్‌లోనే! 
క్రిస్మస్‌కి ఇవ్వదగ్గ బెస్ట్ గిఫ్ట్స్ ఇవే.. అన్నీ తక్కువ బడ్జెట్‌లోనే!

Christmas Gift Ideas : క్రిస్మస్‌కి ఇవ్వదగ్గ బెస్ట్ గిఫ్ట్స్ ఇవే.. అన్నీ తక్కువ బడ్జెట్‌లోనే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2023
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రిస్ మస్(Christmas) సందర్భంగా తమ బంధువులకు, స్నేహితులకు, అదే విధంగా ఇష్టమైన వారికి గిప్ట్స్ అందిస్తూ ఉంటారు. క్రిస్మస్ కు ఇంకా కేవలం కొన్ని రోజులలోనే రానుంది. అయితే మీకు ఏ గిప్ట్ కొనాలనే దానిపై క్లారిటీ రావడం లేదా, అయితే మీరు ఈ గిఫ్ట్ ఐడియాలపై ఓ లుక్కేయండి. నచ్చినవారికి వాటిని బహుమతిగా అందజేయండి. చలికాలంలో స్క్రార్ఫ్స్ ఫ్యాషన్‌బుల్‌గా ఉంటాయి. వీటిని ఏ దుస్తులతోనైనా పెయిర్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ స్కార్ఫ్స్ ను వివిధ రకాలుగా స్టైల్ చేయవచ్చు. ఇది కేవలం మహిళలకే కాకుండా యూనిసెక్స్​ స్కార్ఫ్స్​ కొని జెంట్స్​కి కూడా గిఫ్ట్ చేయవచ్చు. ముఖ్యంగా స్వెటర్లు గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. వీటికి ఎవరూ నో చెప్పరు.

Details

స్వెటర్లు గిఫ్ట్ ఇవ్వడం మంచిది

ఎందుకంటే వీటిని ధరించిన ప్రతిసారి మిమ్మల్ని వారు గుర్తు చేసుకుంటారు. కావున చలికాంలో గిప్ట్‌గా స్వెటర్లు ఇవ్వడం మంచిది. స్వెటర్​ వేసుకోని వారి కోసం హూడీలు తీసుకోవచ్చు. సువాసన, రిలాక్స్ ను అందించే క్యాండిల్స్ ఇవ్వడం మంచి ఐడియా. ఇవి ఒత్తిడిని దూరం చేస్తాయి. వీటి కోసం మీరు లావెండర్, గులాబీ వంటి అనేక సువాసన గల క్యాండిల్స్ ఎంచుకోవచ్చు. మిత్రులు, కుటుంబ సభ్యుల కోసం మంచి డెయిరీ లేదా ప్లానర్ ఇవ్వొచ్చు. ఇది రోజూ వారి పనులను గుర్తు చేసేందుకు, చేసిన పనులు గురించి తలచుకునేందుకు మంచి బహుమతి అవుతుంది. ఇక మిత్రుల ఇంట్లో పిల్లలు ఉంటే శాంటా కాస్ట్యూమ్స్ కొనచ్చు. పిల్లలు శాంటా కాస్ట్యూమ్ లో సూపర్ క్యూట్‌గా ఉంటారు.