
Motivational: వీరి చేతుల్లో డబ్బు నిల్వ ఉండడం కష్టం!
ఈ వార్తాకథనం ఏంటి
చాణక్యుని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గొప్ప పండితుడు,రాజకీయంలో అద్భుత మార్గదర్శకుడనే పేరు సంపాదించారు. అంతే కాకుండా ఎన్నో విషయాల గురించి చాణక్యుడు వివరంగా తెలియజేశాడు. ఆయన డబ్బు,ఆర్థిక నిర్వహణ గురించి చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. కొందరు వ్యక్తుల చేతిలో ఎప్పుడూ డబ్బు నిల్వ ఉండదు. దీని వెనుక వారి అలవాట్లు ప్రధాన కారణమని చాణక్యుడు పేర్కొన్నారు. ఇప్పుడు మనం అలా డబ్బు నిల్వ ఉండని కారణాలు ఏమిటో చూద్దాం.
వివరాలు
ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తారో వారికీ ఆర్థిక ఇబ్బందులు తప్పవు
ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించి జీవించేందుకు ప్రయత్నిస్తారు.ప్రతిరోజూ కొంతమొత్తంలో డబ్బు సంపాదించి జీవిత యాత్ర కొనసాగిస్తుంటారు. అయినప్పటికీ కొందరు ఎంత సంపాదించినా,ఆ సంపాదనతో వారి చేతుల్లో రూపాయి నిల్వ ఉండదు. దాంతో వారు ఎప్పటికప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి పరిస్థితికి ముఖ్యకారణం వారి దైనందిన అలవాట్లేనని,వాటిని మార్చుకోవడం ద్వారా ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చాణక్యుడు చెప్పిన మాటల్లోనూ ఇదే ఉద్దేశ్యం ఉంది.ఎవరు ఎక్కువగా ఖర్చు చేస్తారో,ముఖ్యంగా వారి ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తారో వారు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు. అలాంటి వ్యక్తులు ఎంత సంపాదించినా ఆ డబ్బు వృధా అయిపోతుంది.అందుకే ఖర్చులుచేసే ముందు ఒక దానికంటే రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందని చాణక్యుడు చెబుతున్నాడు.
వివరాలు
ఈ అలవాట్లు ఆర్థిక సమస్యలకు దారి తీస్తాయి
ప్రతి వ్యక్తికి సోమరితనం పెద్ద శత్రువుగా ఉంటుందన్న మాట కూడా చాణక్యుడి సూచన. ఎవరు ఎక్కువగా అలసటతో, పనిని వాయిదా వేసుకునే అలవాటుతో ఉంటారో, వారికి పని చేయడంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, అవసరంలేని ఖర్చులు చేయడం,బాధ్యతను పట్టించుకోకపోవడం వంటి అలవాట్లు ఆర్థిక సమస్యలకు దారి తీస్తాయని చాణక్యుడు చెప్పుకొచ్చాడు. అదేవిధంగా, ఆర్థిక ఇబ్బందులకు చెడు అలవాట్లు ప్రధాన కారణమని కూడా ఆయన పేర్కొన్నారు. ఎక్కువగా మద్యాన్ని సేవించే వారు, చెడు అలవాట్లలో ఉండేవారు,అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేసే వారు ఆర్థికంగా ఎక్కువగా బలహీనతను ఎదుర్కొంటారని చాణక్యుడు స్పష్టంగా చెప్పారు.