Page Loader
Curry leaves: ప్రతిరోజూ కరివేపాకు తీసుకుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతిరోజూ కరివేపాకు తీసుకుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Curry leaves: ప్రతిరోజూ కరివేపాకు తీసుకుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2023
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ వంటకాల్లో కరివేపాకు(Curry leaves)భాగమైపోయింది. ఇది లేకుండా ఎలాంటి వంటకాలు చేయలేం. ఈ కరివేపాకు వాసన, రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కావున ప్రతిరోజూ ఈ కరివేపాకుని మితంగా తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే విటమిన్లు లభిస్తాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ ఉండటంతో అనేక వ్యాధులు దరి చేరకుండా నివరిస్తుంది. ముఖ్యంగా కొవ్వును కరిగించడానికి ఇది సాయపడుతుంది. క్రమం తప్పకుండా కరివేపాకును తీసుకుంటే మొండి పొట్ట కొవ్వును తగ్గించడంతో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది. దీంతో స్లిమ్ తయారయ్యే అవకాశం ఉంది.

Details

కరివేపాకు టీ ఆరోగ్యానికి చాలా మంచిది

కరివేపాకు చక్కెర స్థాయిని నియంత్రించడంలో సాయపడుతుంది. దీని వల్ల బరువు తగ్గడంతో పాటు కంటి చూపు మెరుగ్గా తయారవుతుంది. ఇక జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు వికారం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కరివేపాకులో ఫైబర్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కనుక రోజు వండుకునే ప్రతి వంటలో కరివేపాకుని చేర్చుకోవాలి. కరివేపాకు టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా 1 కప్పు నీటిని మరిగించి, అందులో 1 స్పూన్ జీలకర్ర, 10-12 కరివేపాకు రెబ్బలు జోడించండి. తర్వాత 3-4 నిమిషాలు ఉడకబెట్టి, ½ tsp పసుపు వేసి కలపాలి.