LOADING...
Motivational: జీవితంలో ఈ పనులు చేయకండి .. ఆలా చేస్తే జీవితం నరకప్రాయమే! 
జీవితంలో ఈ పనులు చేయకండి .. ఆలా చేస్తే జీవితం నరకప్రాయమే!

Motivational: జీవితంలో ఈ పనులు చేయకండి .. ఆలా చేస్తే జీవితం నరకప్రాయమే! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహానుభావుడు గొప్ప పండితుడిగా, విస్తృతమైన జ్ఞానంతో ప్రసిద్ధి చెందాడు. అనేక విషయాలపై తన పరిజ్ఞానం ద్వారా ప్రజలకి మార్గదర్శకత్వం అందించాడు. ముఖ్యంగా, ఆయన రాసిన నీతి శాస్త్రం ద్వారా జీవితంలోని వివిధ అంశాల గురించి లోతైన అవగాహన కల్పించాడు. ఈ నీతులు నేటి తరం వారికి ఎంతో ఉపయోగకరం అవుతున్నాయి. చాణక్యుడు తన అనుభవాలు, పరిశీలనల ఆధారంగా 'నీతి శాస్త్రం' అనే గ్రంథాన్ని రచించాడు. ఈ పుస్తకం ద్వారా మనం జీవితాన్ని ఎలా సాగించాలి, మంచి ఆచారాలను ఎలా అలవర్చుకోవాలి, విజయాన్ని సాధించేందుకు ఏ విధంగా ప్రవర్తించాలి వంటి ఎన్నో కీలక విషయాలు నేర్చుకోవచ్చు.

వివరాలు 

మనం చేసే కొన్ని తప్పులే మన జీవితాన్ని నరకప్రాయంగా మారుస్తాయి

అంతేకాదు, చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో చేయకూడని పనుల గురించి కూడా స్పష్టంగా వివరించాడు. ఆయన చెప్పినట్లుగా, మనం చేసే కొన్ని తప్పులే మన జీవితాన్ని నరకప్రాయంగా మారుస్తాయి. మరికొన్ని తప్పులు మనం మరణించిన తర్వాత కూడా అవి మనల్ని వదలవు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అవి ఏమిటో తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు మోసం చేయడం ఒక మహా పాపమని హెచ్చరించాడు. అది స్నేహ సంబంధమా, కుటుంబ సంబంధమా, లేదా ఉద్యోగ సంబంధమా ఏదైనా సరే, మీరు ఎవరినైనా మోసం చేస్తే తప్పనిసరిగా ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి వారు ఎప్పుడూ మనశ్శాంతిని పొందలేరని ఆయన చెప్పాడు.

వివరాలు 

అబద్ధం చెప్పకూడదు 

మన పెద్దలు చెబుతుంటారు, అబద్ధం చెప్పకూడదని. కానీ, ఒక వ్యక్తి పదేపదే అబద్ధం చెప్పడం కూడా ఒక పెద్ద పాపమని చాణక్యుడు తెలిపాడు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం వల్ల మీరు చివరకు ఎవరి నమ్మకాన్ని పొందలేరు. కొంత కాలం తరువాత నిజం బయటపడుతుంది. దీంతో మీకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన హెచ్చరించాడు. ఆచార్య చాణక్యుడు చేయకూడని పాపాల గురించి తెలియజేస్తూ, ఒక వ్యక్తి వేరొకరి భార్య లేదా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు అని చెప్పాడు. ఇది మహాపాపంగా నిలుస్తుంది. ఇలాంటి పాపం వలన వ్యక్తి సమాజంలో గౌరవం కోల్పోవాల్సి వస్తుంది. ఎప్పటికీ కష్టాలతో జీవించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.