Skin care tips : చలికాలంలో చర్మ రక్షణకు తప్పనిసరి చిట్కాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలం సాధారణంగా హాయిగా అనిపించినా... ఈ సీజన్‌లో చాలామంది విహారయాత్రలకు వెళ్లాలనుకుంటారు. అయితే ఇదే సమయంలో చర్మం బిగుతుగా, తీవ్రంగా పొడిబారడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. చలికి తట్టుకునేందుకు చాలామంది టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, స్వెటర్లు ధరించడం చేస్తారు. కానీ ఇవి మాత్రమే చర్మాన్ని రక్షించడానికి సరిపోవని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే తప్పక కొన్ని ప్రత్యేక సూచనలు పాటించాలి. అవే ఇప్పుడు చూద్దాం.
Details
1. జిడ్డుగా మారే చర్మానికి సహజ పౌడర్లే ఉత్తమం
శీతాకాలంలో చాలా మంది చర్మం జిడ్డుగా మారిపోతుందని పేర్కొంటారు. కాబట్టి రెడీమేడ్ క్రీమ్స్ కన్నా ఇంటిలోనే సహజ పదార్థాలతో పౌడర్ తయారు చేసుకోవడం ఉత్తమం. తేనె కలబంద (అలోవెరా) రోజ్ వాటర్ ఈ పదార్థాలతో తయారుచేసిన ప్యాక్/పౌడర్‌ను చర్మంపై అప్లై చేస్తే చర్మం మృదువుగా, సున్నితంగా ఉంటుంది. పైగా ఇవి చర్మంపై ఉన్న మురికిని త్వరగా తొలగించడంలో సహాయపడతాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారిస్తాయి.
Details
2. వేడి నీటితో స్నానం చేయడంలో జాగ్రత్త
శీతాకాలంలో చాలామంది ఎంతో వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తుంటారు. కానీ ఇది చర్మానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాలా వేడి నీటితో స్నానం చేస్తే చర్మం మరింత పొడిబారుతుంది. దీర్ఘకాలం వేడి నీటితో స్నానం చేయడం వల్ల స్కిన్ సమస్యలు పెరుగుతాయి. అందువల్ల మోస్తరు వేడి నీటినే ఉపయోగించాలి. స్నానం అనంతరం చర్మాన్ని రక్షించడానికి తప్పకుండా మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
Details
3. చర్మాన్ని రక్షించేందుకు ఆహారంలో వేడి పదార్థాలు చేర్పించండి
శీతాకాలంలో కేవలం క్రీమ్స్ వాడడం మాత్రమే సరిపోదు. ఆరోగ్యకరమైన ఆహారంతో శరీరానికి లోపల నుంచి వెచ్చదనం అందితే చర్మం మరియు ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. ఈ సీజన్‌లో తప్పకుండా ఆహారంలో చేర్చాల్సినవి: క్యారెట్లు ఉసిరి నారింజ జామ ఆకుకూరలు బాదం వాల్‌నట్స్ చియా గింజలు ఇవన్నీ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండి ఉండటంతో చర్మాన్ని లోపలి నుంచి కాంతివంతంగా చేస్తాయి.