
Menopause Prevention : మెనోపాజ్ సమయంలో మహిళలు పాటించాల్సిన నియమాలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా మహిళల్లో మెనోపాజ్ 48-49 ఏళ్లలో వస్తుంది. ఆ సమయంలో మహిళలు సరిగా నిద్రపోరు.
పడుకొనే ముందు కెఫీన్తో కూడిన టీ, కాఫీలకు, ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండడం మంచిది.
మెనోపాజ్ ని రుతువిరతి అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యవంతంగా జీవించడం అవసరం.
ఎన్నో సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి మెనోపాజ్ దశ ప్రారంభం కాగానే నిలిచిపోతుంది.
ఈ సమయంలో శరీరక ఇబ్బందులు తలెత్తుతాయి.
ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గుముఖం పట్టడంతో కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే ప్రమాదముంది.
మహిళల్లో 45 నుండి 50 సంవత్సరాల వయసులో వరసగా పన్నెండు నెలలు బహిష్టులు రాకుండా ఆగిపోతే దానిని మెనోపాజ్ అంటారు.
Details
మద్యపానం, ధూమపానం తీసుకోవడం తగ్గించుకోవాలి
చిన్న వయసులో గర్భసంచి తొలగించిన వారికి కూడా తొందరగా మెనోపాజ్ లక్షణాలు కనపడతాయి.
దీని కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
పండ్లు, కూరగాయాలు, తృణ ధాన్యాలు, లీన్ ప్రోటీన్లు తీసుకోవడం మంచిది. అదే విధంగా గుండెకు మేలు చేసే వ్యాయామాలు చేయాలి.
ముఖ్యంగా దూమపానం, మద్యపానాన్ని తీసుకోవడం తగ్గించాలి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి నీరు ఎక్కువగా తాగాలి.
ఒత్తిడి తగ్గించుకునేందుకు విశ్రాంతి తీసుకోవాలి.
ఇక రుతుక్రమం ఆగిన తర్వాత ఆ లక్షణాల నుండి బయటపడటానికి హార్మోన్ థెరపీ సమర్థవంతంగా సాయపడుతుంది.
ఎముకల సాంద్రత,గుండె ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వైద్యులతో రెగ్యులర్ చెప్-అప్‌లు చేయించుకోవాలి