LOADING...
Motivation : కొడుకు, కోడలి విషయంలో అత్తలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలివే! 
కొడుకు, కోడలి విషయంలో అత్తలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Motivation : కొడుకు, కోడలి విషయంలో అత్తలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలివే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2025
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య చాణక్యుడు కుటుంబం, బంధాలు, బంధుత్వాలపై అనేక విలువైన విషయాలు తెలియజేశారు. తన అనుభవాల ఆధారంగా రాసిన చాణక్య నీతి శాస్త్రంలో భవిష్యత్ తరాలకు ఎన్నో సూచనలిచ్చారు. ముఖ్యంగా కొడుకు వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. చాణక్యుడి మాటల ప్రకారం, కొడుకు వివాహం తర్వాత లేదా పెద్దవాడై కుటుంబ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతాడు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు అతని నిర్ణయాలను గౌరవించాలి కానీ, అతిగా గుడ్డిగా నమ్మడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఆ నిర్ణయాలు కొన్ని సార్లు సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ప్రేమ చూపించడంలో అతిగా ఆరాటపడకూడదని ఆయన హెచ్చరించారు.కోడలి ప్రవర్తన విషయంలో కూడా చాణక్యుడు ప్రత్యేకంగా సూచించారు.

Details

పూర్తి నమ్మకం పెట్టుకోవాలి

కోడలి ప్రవర్తన ఇంటి వాతావరణం, కుటుంబ శాంతి, ఆనందాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి కోడలిలో ఏవైనా మార్పులు గమనిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సమయంలో పూర్తి నమ్మకం పెట్టుకోవడం కంటే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంకా ఆయన చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఆర్థిక రహస్యాలపై, ఎంత సన్నిహితమైన వారైనా సరే, ఆస్తి, డబ్బు వంటి విషయాలను కొడుకుతో గానీ, కోడలితో గానీ సులభంగా పంచుకోవద్దని చెప్పారు. కుటుంబ భద్రత, భవిష్యత్ భరోసా విషయంలో జాగ్రత్త అవసరమని సూచించారు. అవసరమని భావించినప్పుడే, వారికి నమ్మకమని భావించినప్పుడే ఆస్తి లేదా ఆర్థిక విషయాలు తెలియజేయాలని సూచించారు. మొత్తానికి, చాణక్యుడు చెప్పిన ఈ సూచనలు ఇప్పటికీ ప్రతి కుటుంబానికి వర్తిస్తాయి.