గృహం: మీ బాల్కనీ అందంగా కనిపించాలంటే ఈ మొక్కలను పెంచండి
తీగ మొక్కలు బాల్కనీలో పర్చుకుని పువ్వులు పూస్తుంటే మీ బాల్కనీకి కొత్త అందం వస్తుంది. ఇంట్లో మొక్కలు పెంచడానికి ఎక్కువ స్థలం లేకపోతే తీగమొక్కలు పెంచండి. అవి మీ ఇంటికి మంచి అందాన్ని తీసుకొస్తాయి. పైకి పాకే తీగమొక్కల్లోని రకాలు ఇక్కడ చూద్దాం. బౌగేన్ విల్లియా: గులాబీ, ఎరుపు, పసుపు, తెలుపు రంగుల్లో పువ్వులను పూచే ఈ మొక్కలను పెంచడం చాలా ఈజీ. వీటికి నిర్వహణ ఎక్కువగా ఉండదు. కాకపోతే ఎండపడే చోట మొక్కలను పెంచాలి. గోల్డెన్ పోథోస్: ఈ మొక్కను సాధారణంగా మనీ ప్లాంట్ అంటారు. ఎండ ఎక్కువ తగలకపోయినా ఈ మొక్కలు పెరుగుతాయి. వీటిని నీళ్ళు కూడా ఎక్కువగా పోయకూడదు. కేవలం తేమ తగిలితే చాలు.
ఇంటికి అందాన్ని, ఒంటికి పరిమళాన్ని తెచ్చే నక్షత్ర మల్లె
మార్నింగ్ గ్లోరీ: సన్నాయి ఆకారంలో పువ్వులు పూచే మార్నింగ్ గ్లోరీ మొక్కలకు ఎండ బాగా అవసరం. రెగ్యులర్ గా నీళ్ళు పోస్తుండాలి. అలా అని తడినేలలో ఈ మొక్క మొలవదు. ఎరుపు, గులాబీ, నీలం, తెలుపు రంగుల్లో పువ్వులు పూస్తాయి. నక్షత్ర మల్లె: నక్షత్ర మల్లె మొక్కలు మంచి సువాసనను అందిస్తాయి. ఎండ ఎక్కువ తగలకపోయినా ఇవి పూస్తాయి. కాకపోతే ఎండ తగిలే ప్రదేశంలో పెడితే మరింత అందంగా పూస్తాయి. నాస్టుర్టియం: నారింజ రంగులో పువ్వులు పూసే ఈ మొక్కను ఎండ తగిలే ప్రదేశంలో పెంచాలి. అలా పూర్తి ఎండలో పెంచకుండా కొద్దిగా నీడనివ్వాలి. ఈ మొక్కను పెంచే మట్టిని తడిగా ఉంచాలి. ఎక్కువగా నీళ్ళు పోస్తే మొక్క సరిగ్గా పెరగదు.