
మీరు చేసే ఎలాంటి పనులు మీ పెంపుడు పిల్లులకు ఇబ్బందిగా అనిపిస్తాయో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
పిల్లిని పెంచుకునేటపుడు దాని లక్షణాలను, అలవాట్లను అర్థం చేసుకోవాలి. పిల్లి గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు మీకు తెలియకుండానే పిల్లులను వేధిస్తుంటారు. ఇబ్బంది పెడుతుంటారు. మీకు ఆ ఉద్దేశ్యం ఉండదు, కానీ మీరు చేసే పనులు పిల్లులకు ఇబ్బందిగా అనిపిస్తాయి. అలాంటి పనులేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఒంటరిగా వదిలివేయడం: పిల్లులను, కుక్కలను ఒంటరిగా వదిలివేస్తే అవి తట్టుకోలేవు. అలా అని పిల్లులు ఒంటరిగా ఉండవా అంటే అదీ కాదు. నిజం చెప్పాలంటే కుక్కల కన్నా పిల్లులు ఎక్కువ సేపు ఒంటరిగా ఉండగలవు.
అలా అని చెప్పి అస్సలు పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేస్తే అవి అలుగుతాయి. ఒక్కోసారి డిప్రెషన్ లోకి వెళ్తాయి. అందుకే ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం వాటితో ఆడుకోండి.
పెట్
పిల్లులకు ఇబ్బందిగా అనిపించే మరికొన్ని పనులు
మరో పిల్లిని పెంచుకున్నప్పుడు: ఒక పిల్లి ఇంట్లో ఉండగా మరో పిల్లిని మీరు పెంచుకోడానికి తీసుకొస్తే అవి తట్టుకోలేవు. వాటిల్లో కోపం పెరుగుతుంది. ఆ కోపాన్ని అవతలి పిల్లిపై చూపిస్తూ ఉంటాయి. అప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలి.
పెద్ద శబ్దాల మధ్య పిల్లిని ఉంచినపుడు: టీవీ వాల్యూమ్ ఎక్కువగా పెట్టి పిల్లిని అక్కడే ఉంచితే అవి భరించలేవు. పిల్లులకు ప్రశాంతమైన వాతావరణం కావాలి. టివీ వాల్యూమ్ ఎక్కువగా పెట్టుకోవాలని మీరనుకుంటే పిల్లిని ఎలాంటి శబ్దాలు వినిపించని ప్రదేశానికి మార్చండి.
వాటికి డ్రెస్ వేసినపుడు: కొందరు తమ పిల్లులు అందంగా కనిపించాలని డ్రెస్ వేస్తారు. అది వాటికి చిరాగ్గా ఉంటుంది. అలాగే పిల్లులను పొట్టమీద కొట్టకూడదు. దానివల్ల పిల్లి ఇబ్బంది పడుతుంది.