పెట్: మీ పెంపుడు పిల్లి మీ దగ్గరకు రావడం లేదా? కారణం తెలుసుకోండి
పిల్లులను, కుక్కలను పెంచుకునే వారు అవి చేసే పనులను అనుక్షణం గమనిస్తుండాలి. అవి ఏ టైమ్ లో ఎలా ఉంటున్నాయో తెలుసుకోవడం ద్వారా వాటికి కలిగే ఇబ్బందులను దూరం చేయవచ్చు. మీరు పిల్లులను పెంచుకుంటే, ఆ పిల్లులు ఒక్కోసారి మీ దగ్గరికి రాకుండా ఉంటాయి. దానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. ఏకాంతం కోరుకుంటాయి: మీ పిల్లి, మిమ్మల్ని వదిలి వెళితే మీరు దానికి కొంత స్పేస్ ఇవ్వండి. పిల్లులు ఒంటరిగా ఉండాలనుకుంటాయి. ప్రతీసారి అవతలి వారి అటెన్షన్ ని అవి కోరుకోవు. మిమ్మల్ని వదిలేసి హ్యాపీగా నిద్రపోతుంటే మీరు వెళ్ళి డిస్టర్బ్ చేయవద్దు. మీ అటెన్షన్ కావాలనుకున్నప్పుడు అవే మీ దగ్గరకు మ్యావ్ అంటూ వస్తాయి. అప్పటి వరకు ఏమీ అనకుండా ఉండండి.
పిల్లులు ఒంటరిగా ఉండాలనుకోవడానికి గల కారణాలు
భయపడినపుడు: మీ పిల్లికి ఏదైనా భయం కలిగినపుడు, లేదా ఏదైనా భయం పుట్టించే సంఘటన జరుగుతుందేమోనన్న అనుమానం ఉన్నప్పుడు అవి ఒంటరిగా తిరుగుతుంటాయి. మీరు వాటిని తిట్టినా, కొట్టినా లేదా దాని చుట్టూ ఉన్న ఉన్న పరిస్థితులు అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా అవి మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్తాయి. జ్వరం వచ్చినపుడు: మీ పిల్లి వయసు పెరుగుతుంటే, వాటికి కొన్నిరకాల వ్యాధులు వస్తుంటాయి. కళ్ళు సరిగా కనిపించకపోవడం, చెవులు వినిపించకపోవడం కూడా మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి కారణం అయ్యుంటుంది. సో, వాటిపట్ల జాగ్రత్తగా ఉండండి. పిల్లులకు బాధ కలిగినపుడు: మీరు మరో పిల్లిని తెచ్చి పెంచుకున్నపుడు అవి బాధపడతాయి. లేదా జ్వరం వచ్చినపుడు కూడా మీకు దూరంగా వెళ్తాయి.