islands: ప్రపంచంలో అత్యధిక దీవులు కలిగిన దేశం ఇదే.. జాబితాలో టాప్ దేశాలు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 లక్షల ద్వీపాలు ఉన్నాయి. భారతదేశంలో మొత్తం 1,382 ద్వీపాలున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యధిక ద్వీపాలు కలిగిన దేశం 2,67,570 ద్వీపాలతో ముందంజలో ఉంది. ఆ దేశం స్వీడన్. స్వీడన్ - ద్వీపాల రాజ్యం ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉన్న స్వీడన్‌లో మొత్తం 2,67,570 ద్వీపసమూహాలు ఉన్నాయి. వీటిలో సుమారు 96,000 ద్వీపాలకు మాత్రమే పేర్లు పెట్టారు. ఈ ద్వీపాలలో దాదాపు 80,000 మంది నివసిస్తున్నారు. బాల్టిక్ సముద్రంలో ఉన్న 'గాట్లాండ్' స్వీడన్‌లో అతిపెద్ద ద్వీపం. మరికొన్ని ప్రధాన ద్వీపాలు వంతెనల ద్వారా స్వీడన్ ప్రధాన భూభాగంతో అనుసంధానించబడి ఉన్నాయి.
Details
నార్వే
జాబితాలో తదుపరి స్థానం 'నార్వే'ది. ఆర్కిటిక్ ప్రాంతంలోని హిమానీనదాలు, పర్వతాలు, సమశీతోష్ణ అడవులు, సరస్సులు వంటి వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలకు ఈ దేశం నిలయం. ఇక్కడ మొత్తం 2,39,057 ద్వీపాలున్నాయి. వాటిలో సుమారు 60,000 మంది నివసిస్తున్నారు. ఈ ద్వీపాలు నార్వేజియన్ ధ్రువ ఎలుగుబంట్లు, వాల్‌రస్‌లు, రెయిన్‌డీర్‌లకు కూడా నివాసస్థలంగా ఉన్నాయి. ఫిన్లాండ్ స్కాండినేవియన్ దేశమైన 'ఫిన్లాండ్'లో మొత్తం 1,70,000 ద్వీపాలున్నాయి. వీటిలో 80,000 మంది నివసిస్తున్నారు. 'ఆలాండ్ దీవులు' (ఆలాండ్) ఫిన్లాండ్‌లోని అతిపెద్ద ద్వీపం. ఇది స్వయంప్రతిపత్తి ప్రాంతంగా గుర్తింపు పొందింది. గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ ప్రాంతం కూడా ముఖ్యమైన ద్వీప సముదాయంగా నిలుస్తుంది.
Details
కెనడా
ప్రపంచంలో అతిపెద్ద దేశాలలో ఒకటైన 'కెనడా'లో 50,000 కంటే ఎక్కువ ద్వీపాలున్నాయి. అయితే వీటిలో కేవలం 52 ద్వీపాల్లో మాత్రమే జనాభా ఉంది. ఆర్కిటిక్ ద్వీపసమూహంలో ఉన్న 'బాఫిన్ ద్వీపం' అతిపెద్ద ద్వీపం. అలాగే న్యూఫౌండ్లాండ్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపం, వాంకోవర్ ద్వీపం ప్రధాన ద్వీపాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాలు హిమానీనదాలు, పర్వతాలు, అడవులు, సరస్సులతో విభిన్న ప్రకృతి సౌందర్యాన్ని అందిస్తాయి. అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశమైన 'యునైటెడ్ స్టేట్'లో సుమారు 18,000 ద్వీపాలున్నాయి. అయితే కేవలం 50 ద్వీపాల్లో మాత్రమే జనాభా నివసిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న 'హవాయి' అతిపెద్ద ద్వీపంగా నిలుస్తుంది. అలాగే 'అలాస్కా' కూడా ముఖ్యమైన ద్వీప ప్రాంతాలను కలిగి ఉంది
Details
ఇండోనేషియా
దక్షిణాసియా దేశమైన 'ఇండోనేషియా'లో మొత్తం 17,508 ద్వీపాలున్నాయి. ఈ ద్వీపాలు అందమైన బీచ్‌లు, వర్షారణ్యాలు, అగ్నిపర్వతాలు, పురాతన దేవాలయాలతో పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా సుమారు 8,200 ద్వీపాలు ఉన్నాయి. వీటిలో కేవలం 300 మంది మాత్రమే నివసిస్తున్నారు. టాస్మానియా ఆస్ట్రేలియాలో అతిపెద్ద ద్వీపం. అలాగే కంగారూ ద్వీపం, ఫ్రేజర్ ద్వీపం, మెల్విల్లే ద్వీపం ముఖ్య ద్వీపాలుగా ఉన్నాయి. ఈ వివరాల ప్రకారం, ప్రపంచంలో అత్యధిక ద్వీపాలు కలిగిన దేశంగా 'స్వీడన్' అగ్రస్థానంలో నిలుస్తుంది.