Page Loader
Diwali 2023 : దీపావళీ రోజున గోంగూర కర్రలతో దివిటీలు కొట్టడానికి కారణమిదే!
దీపావళీ రోజున గోంగూర కర్రలతో దివిటీలు కొట్టడానికి కారణమిదే!

Diwali 2023 : దీపావళీ రోజున గోంగూర కర్రలతో దివిటీలు కొట్టడానికి కారణమిదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2023
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి రోజు చిన్న పిల్లలతో పెద్దలు దగ్గరుండి దివిటీలు కొట్టించడం అనవాయితీ. గోంగూర కర్రలకు నూనెలో నానబెట్టిన ఒత్తిలాంటి బట్టను కట్టి, దాన్ని దీపంతో వెలిగిస్తారు. అలా కాసేపు ఉంచుతారు. చంటిపిల్లలకైతే గోంగూరు కర్రలు కాలకుండా చెరుక గడ ముక్కలకు ఒత్తిలు కట్టించి కొట్టిస్తారు. ఇలా వరుసగా మూడు లేదా ఐదు సంవత్సరాలు దివిటీలు చెరుక గడ ముక్కలతోనే దివిటీలను కొట్టిస్తారు. ఇక పిల్లలను వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలు వెలిగిస్తారు. అలా అకాశంలో దక్షిణవైపు చూపిస్తూ గుండ్రంగా మూడసార్లు తిప్పుతారు. "దిబ్బూ దిబ్బూ దీపావళి..మళ్ళీ వచ్చే నాగుల చవితి'' అంటూ పిల్లలతో పాడిస్తూ నేలమీద గోంగూర కర్రలతో కొట్టిస్తారు.

Details

దివిటీల వల్ల వచ్చే శబ్దంతో తమ వారుసులను పితృదేవతలు గుర్తిస్తారు

దివిటీలు కొట్టడం పూర్తి అయిన వెంటనే పిల్లల కాళ్లు, చేతులు కడుగుతారు. తర్వాత నోరు శుభ్రం చేయించి మిఠాయిలు తినిపిస్తారు. అనంతరం పిల్లలతో కలిసి పెద్దలు టపాకాయాలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. దీపావళి రోజు పితృ దేవతల సంథ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ పిల్లల గ‌ృహాలను చూస్తారట. వారికి కనిపించడం కోసమే దీపాలు వెలిగిస్తారట. దీంతో దివిటీలు కొట్టే సంప్రదాయం ఏర్పడిందని పెద్దలు చెబుతుంటారు. దివిటీలు కొట్టే శబ్దానికి పితృదేవతలు తమ వారసుల పిల్లలను గుర్తిస్తారని అంటారు.