
Hippocampus: చిన్నారుల జ్ఞాపకశక్తి రహస్యం ఇదే.. నాలుగు నెలలకే గుర్తుంచుకునే శక్తి!
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా చిన్నపిల్లలకు జ్ఞాపకశక్తి ఉండదని చాలామంది నమ్ముతారు. కానీ తాజా పరిశోధనలు దీనికి పూర్తి భిన్నమైన విషయాన్ని బయటపెట్టాయి. కేవలం నాలుగు నెలల వయసున్న శిశువులు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోగలరని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిశోధన వివరాలు యేల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నాలుగు నెలల నుంచి రెండేళ్ల మధ్య వయసున్న 26 మంది పిల్లలపై ఈ అధ్యయనం చేశారు. ఈ క్రమంలో MRI స్కాన్ చేస్తూ వారికి కొన్ని బొమ్మలు, వస్తువులను చూపించారు. కొద్దిసేపటి తర్వాత కొత్త బొమ్మలు చూపించినప్పుడు, పిల్లలు ముందుగా చూసిన వాటిపైనే ఎక్కువసేపు దృష్టి సారించారు. దీని ద్వారా వారికి వాటిని గుర్తుంచుకునే శక్తి ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.
Details
మెదడు పనితీరు
పిల్లల మెదడులోని 'హిప్పోకాంపస్' అనే భాగం జ్ఞాపకాలను సృష్టించడంలో చురుకుగా పనిచేస్తుందని ఈ అధ్యయనంలో నిర్ధారించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చిన్ననాటి జ్ఞాపకాలు వారు పెద్దయ్యాక గుర్తుకు రావు అని నిపుణులు చెబుతున్నారు. విజ్ఞానపరమైన ప్రాధాన్యం ఈ పరిశోధనల ద్వారా పిల్లలు భాషను ఎలా నేర్చుకుంటారు, వారి అభివృద్ధి దశలు ఎలా ఉంటాయి అనే విషయాలు మరింత స్పష్టత వస్తాయి. అదేవిధంగా వృద్ధాప్యంలో వచ్చే 'అల్జీమర్స్' వంటి జ్ఞాపకశక్తి సమస్యలను అర్థం చేసుకోవడానికి కూడా ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడనుంది.