Loading...
e-Shram Card Apply : ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా సులభంగా రూ. 3 వేల పింఛన్, బీమా పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే!
ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా సులభంగా రూ. 3 వేల పింఛన్, బీమా పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే!

e-Shram Card Apply : ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా సులభంగా రూ. 3 వేల పింఛన్, బీమా పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2024
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

అసంఘటిత రంగాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఈ-శ్రమ్ యోజన' పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా, అసంఘటిత రంగాల కార్మికుల కోసం ప్రత్యేకంగా 'ఈ-శ్రమ్ పోర్టల్' ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్‌ ప్రధాన లక్ష్యం అసంఘటిత రంగాల కార్మికుల డేటాబేస్ రూపొందించి, వారికి వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడమే ముఖ్య లక్ష్యం. ఈ-శ్రమ్ కార్డు పొందిన కార్మికులు బహుళ ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్, మరణాంతరం బీమా, అలాగే వైకల్యం ఏర్పడితే ఆర్థిక సాయం వంటి ఎన్నో సదుపాయాలున్నాయి. ఈ-శ్రమ్ కార్డును పొందడానికి, కార్మికులు ఆన్‌లైన్‌లో esharm.gov.in ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Details

 ఈ-శ్రమ్ కార్డు అర్హతలు

అసంఘటిత రంగాల్లో పనిచేసే వ్యక్తి

వయస్సు 16-59 సంవత్సరాల మధ్య ఉండాలి

ఆధార్‌తో లింక్‌ చేసిన మొబైల్ నంబర్ కలిగి ఉండాలి

ఆదాయపు పన్ను చెల్లించనివారు మాత్రమే అర్హులు

ఆన్‌లైన్‌లో *ఈ-శ్రమ్ కార్డు' దరఖాస్తు చేసే విధానం

1.https://eshram.gov.in పోర్టల్‌కి వెళ్లి, ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ నమోదు చేయండి.

2. మీ ఫోన్‌కి వచ్చిన ఓటీపీని నమోదు చేసి, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

3. కావలసిన వ్యక్తిగత వివరాలు, అడ్రస్, విద్యాసంబంధిత వివరాలను నమోదు చేయండి.

4. ఉపాధి, వ్యాపార రకానికి సంబంధించిన వివరాలు తెలపండి.

5. చివరగా, సబ్మిట్‌ చేసిన తర్వాత ఈ-శ్రమ్ కార్డు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Details

ఈ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు

60 ఏళ్లు నిండినవారికి నెలకు రూ.3,000 పింఛను

మరణానంతరం రూ.2,00,000 బీమా కవరేజీ, వైకల్యం అయితే రూ.1,00,000

జీవిత భాగస్వామికి పార్థివ ప్రయోజనాలు అందించేందుకు అవకాశం

ఈ-శ్రమ్ కార్డు దేశమంతటా చెల్లుబాటు అవుతుంది

ఈ-శ్రమ్ కార్డు కోసం అవసరమైన పత్రాలు ఇవే

ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్

బ్యాంక్ ఖాతా వివరాలు

ఆధార్ కార్డు

ADVERTISEMENT

Details

ఆన్‌లైన్‌లో ఈ-శ్రమ్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే 

1.https://eshram.gov.in పోర్టల్‌కి వెళ్లి, "Login Using UAN" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

2. UAN, పుట్టిన తేదీ, క్యాప్చా ఎంటర్ చేసి 'జనరేట్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.

3. మీ ఫోన్‌కి వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్‌ చేయండి.

4. స్క్రీన్‌పై ఈ-శ్రమ్ కార్డు డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

ఈ-శ్రమ్ కార్డు** ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇంకా కేంద్రం అందించే భద్రతా పథకాలు కార్మికుల భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి.

ADVERTISEMENT