మైగ్రేన్ నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించాలి
మాములు తలనొప్పికి, మైగ్రేన్ కి చాలా తేడా ఉంటుంది. మైగ్రేన్ వలన నొప్పి ఎక్కువగా ఉంటుంది. అందుకే మైగ్రేన్ నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించాలి. ఐస్ ప్యాక్ నుదుటి మీద పెట్టుకుంటే మైగ్రేన్ నొప్పి తగ్గుంతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. మైగ్రేన్ వచ్చినప్పుడు నిశబ్దంగా, వెలుతురు తక్కువ ఉన్న చోటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలి. శరీరానికి తగినంత నీరు తీసుకోవాలి. కాఫీ, టీలలో ఉండే కెఫీన్ వలన మైగ్రేన్ తగ్గే అవకాశం ఉంది. అయితే మోతాదుకు మించి తీసుకోకూడదు. ఆహారం తినేటప్పుడు మరీ ఎక్కువగా నమలకుండా తినాలి. మైగ్రేన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఒత్తిడి అది తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయాలి.
మందులు వైద్యుల పర్యవేక్షణలో వాడాలి
మసాజ్ వలన కూడా మైగ్రేన్ నుండి ఉపశమనం పొందచ్చు. నొప్పి రోజువారీ కార్యక్రమాలకు ఆటంకంగా ఉంటే పెయిన్ కిల్లర్స్ వాడచ్చు. అయితే వైద్యుల సలహా మీద మాత్రమే ఎసిటమైనోఫెన్, ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ వంటివి వాడచ్చు. మైగ్రేన్ రావడానికి కారణాలు గుర్తించి అది రాకుండా ముందుగానే జాగ్రత్తపడచ్చు. ఒక్కోసారి సమయానికి తినకపోయినా, బ్లడ్ షుగర్ తక్కువ ఉన్నా ఇంకా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లినా రావచ్చు. ఆలస్యం చేయకుండా మైగ్రేన్ మొదలైన కొత్తలోనే సరైన చికిత్స చేసుకోవడం ముఖ్యం లేదంటే ఏళ్ల తరబడి మైగ్రేన్ నొప్పిని భరించాల్సి వస్తుంది. మైగ్రేన్ లో వివిధ రకాలు ఉంటాయి అందుకే వైద్యుల దగ్గరకు వెళ్లి అందుకు తగిన ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం.