
IRCTC Tirupati Tour: తిరుమల శ్రీవారి దర్శనం ఇక సులభం.. IRCTC ప్రత్యేక టూర్ డీటైల్స్!
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి సెలవుల సందర్భంగా చాలా మంది ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు వివిధ ప్రదేశాలకు విహరించేందుకు ఆసక్తి చూపుతారు.
ఈ నేపథ్యంలోని ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
హైదరాబాద్ నగర వాసుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆధ్యాత్మిక టూర్ ద్వారా తిరుపతి, తిరుచానూరు, శ్రీకాళహస్తిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది.
రైలు ద్వారా ప్రయాణించే ఈ ప్యాకేజీ పేరు "తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్". మొత్తం మూడు రాత్రులు, నాలుగు పగళ్ళు కొనసాగే ఈ టూర్ ద్వారా భక్తులు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు.
Details
తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ టూర్ వివరాలు
"తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్" పేరిట ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
ఈ టూర్ నాలుగు రోజులపాటు సాగుతుంది, ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి.
టూర్ షెడ్యూల్
మొదటి రోజు
రాత్రి 8:05 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12797) బయల్దేరుతుంది. భక్తులు రాత్రంతా ప్రయాణిస్తారు.
రెండో రోజు
ఉదయం 07:05 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాక, హోటల్‌కి వెళ్లి చెకిన్ చేయాలి. ఫ్రెషప్ అయిన తర్వాత తిరుచానూరు పద్మావతి ఆలయాన్ని దర్శించుకోవాలి.
అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాక, శ్రీకాళహస్తి ఆలయానికి ప్రయాణం. శ్రీకాళహస్తి స్వామిని దర్శించుకున్నాక తిరిగి తిరుపతికి వచ్చి హోటల్‌లో బస చేయాలి.
Details
మూడో రోజు
తెల్లవారుజామునే హోటల్ నుండి బయల్దేరి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలి. ఉచిత దర్శనం అనంతరం తిరిగి తిరుపతిలోని హోటల్‌కు చేరుకోవాలి.
సాయంత్రం
హోటల్ చెకౌట్ చేసి తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. 06:35 గంటలకు బయల్దేరే ట్రైన్ (12798) ద్వారా తిరిగి హైదరాబాద్ ప్రయాణం.
నాలుగో రోజు
ఉదయం 06:20 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. దీంతో తిరుపతి టూర్ ముగుస్తుంది.
Details
టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు
కంఫర్ట్ క్లాస్ (3AC)
సింగిల్ షేరింగ్ - రూ. 13,810
డబుల్ షేరింగ్ - రూ. 10,720
ట్రిపుల్ షేరింగ్ - రూ. 8,940
5-11 ఏళ్ల పిల్లలకు (విత్ బెడ్) - రూ. 6,480
5-11 ఏళ్ల పిల్లలకు (విత్ అవుట్ బెడ్) - రూ. 5,420
స్టాండర్డ్ క్లాస్ (SL)
సింగిల్ షేరింగ్ - రూ. 12,030
డబుల్ షేరింగ్ - రూ. 8,940
ట్రిపుల్ షేరింగ్ - రూ. 7,170
5-11 ఏళ్ల పిల్లలకు (విత్ బెడ్) - రూ. 4,710
5-11 ఏళ్ల పిల్లలకు (విత్ అవుట్ బెడ్) - రూ. 3,650
Details
వివరాలు కోసం సంప్రదించాల్సిన నెంబర్లు ఇవే
ఈ టూర్ ద్వారా ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు.
ప్రస్తుతం ఈ టూర్ మార్చి 29వ తేదీన ప్రారంభమవుతోంది. మ
రిన్ని వివరాలకు IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 9701360701 / 9281030712 నెంబర్లను సంప్రదించవచ్చు.