Travelling Benefits: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రయాణాలు చేయాల్సిందే!
ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటానికి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రోజు మంచి ఫుడ్ తీసుకొని, జిమ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే పోరపాటే. మానసిక ఆరోగ్యంతోనే శారీరక ఆరోగ్యం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణాలు చేయడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయట. ప్రయాణాలు చేయడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. రోజువారి కార్యకలాపాల నుండి విరామం తీసుకొని పలువురు ఆనందం, స్వేచ్ఛ కోసం ప్రయాణం చేస్తారు. మనిషి ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ప్రయాణం చేయాలి. వివిధ రకాలైన జెర్మ్స్, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి రోగనిరోధక వ్యవస్థ అవసరం ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను రక్షించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
డిప్రెషన్ కు ప్రయాణం అద్భుతమైన ఔషదం
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల శరీరం కొత్త బ్యాక్టీరియాకు అలవాటుపడుతుంది. జీవింతంలో ఒత్తిడిని కూడా ప్రయాణం తగ్గిస్తుంది. ముఖ్యంగా ప్రయణాలు చేయడం వల్ల చాలా సంతోషంగా, ఆనందగా ఉంటారని, మానిసిక ఒత్తిడి తగ్గుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. డిప్రెషన్ కు ప్రయాణం అద్భుతమైన ఔషదమని చెప్పొచ్చు. మూడు రోజుల కంటే ఎక్కువ ట్రిప్ చేయడం ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణంతో కొత్త కొత్త విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ఇక రెగ్యులర్ ట్రిప్‌లకు వెళితే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది.