Diabetes Control Tips: వింటర్‌లో డయాబెటీస్ అదుపులో ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలం మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే చలి దెబ్బ ఎక్కువగానే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో డయాబెటీస్ ఉన్నవారు సాధారణ రోజులతో పోలిస్తే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సీజన్‌లో రక్తంలో చక్కెర స్థాయిలు అనూహ్యంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో, షుగర్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం లేవగానే తప్పనిసరిగా గోరు వెచ్చని నీళ్లు తాగాలని సూచన. ఇది మెటబాలిజం స్టార్ట్ అవ్వడంలో సహాయపడుతుంది. అల్పాహారంలో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని చేర్చాలి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
Details
పండ్లు ఎక్కువగా తీసుకోవాలి
చలికాలంలో పండ్లు ఎక్కువగా తింటే గ్లూకోజ్ స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి. కాబట్టి పండ్లు తినడంలో పరిమితి తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిళ్లు ఎక్కువ తినడం పూర్తిగా తగ్గించాలి. హెవీ ఫుడ్స్ రాత్రి వేళ రక్తంలో చక్కెర స్థాయిల్ని అస్థిరం చేస్తాయి. అలాగే ప్రతిరోజూ 20 నుంచి 30 నిమిషాలు వాకింగ్ చేయడం డయాబెటీస్ నియంత్రణకు అత్యంత అవసరమని వైద్యులు చెబుతున్నారు.