Nani : ఫిట్‌నెస్ సీక్రెట్'పై నాని కీలక వ్యాఖ్యలు.. శారీరకంగా వేధించకూడదని సూచన
హీరో నాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ మేరకు తన ఫిట్‌నెస్ గురించి, ఆహార అలవాట్ల గురించి నాని రివీల్ చేశాడు. అసలు నాని అంత ఫిట్‌గా ఎలా ఉంటాడు అన్న ప్రశ్నకు ఆశ్చర్యపోయే సమాధానమిచ్చాడు. హాయ్ నాన్నలో తన పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారని నానిని అడగగా కొంచెం బరువు తగ్గాను అని బదులిచ్చాడు. ఈ క్రమంలోనే తను ఎక్కువగా జిమ్ చేయడం, బరువులు ఎత్తడం లాంటివి ఎప్పుడూ ప్రేక్షకులు చూడలేదని, ఫిట్‌గా ఉండేందుకు ఏం చేస్తుంటారని తనకు ప్రశ్న ఎదురైంది. ఇందుకు కార్డియో వల్లే ఫిట్‌గా ఉన్నానని సింపుల్‌గా సమాధానం ఇచ్చాడు నాని. శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండేందుకు ఏం చేస్తుంటారని అడగిన ప్రశ్నపైనా ఆయన స్పందించారు.
వర్క్ వల్లే ఫిట్'గా ఉన్నాను : నాని
నేను ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాను.అది చాలా ముఖ్యం.ఇంట్లోనే ఉంటూ లేవకుండా పనిచేయకుండా ఉంటే కచ్చితంగా బరువు పెరగేందుకు కారణమవుతుందన్నారు. ఇదే సమయంలో తన వర్క్ వల్లే ఫిట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చాడు.అదే సెట్ అవుతుంది.నేను ఏదైనా తినగలను. నేను అంత స్టేట్‌మెంట్ ఇచ్చేంత ప్రొఫెషనల్ కాదని కానీ నాకు తెలిసినవారిలో చూసింది ఏంటంటే, బరువు తగ్గాలని, ఆ డైట్ అని, ఈ డైట్ అని, అది తినడం మానేసి, ఇది తినడం మానేసిన వారు కొన్నాళ్లకు బరువెక్కిపోతున్నారు. ఎందుకంటే వాళ్లు శరీరాన్ని వేధిస్తున్నారు. చిన్నప్పటి నుంచి మనం ఏం తింటామో దానికే మన శరీరం అలవాటు అవుతుంది. ఎవరైనా వచ్చి మీరు అది తింటారా మంచిది కాదు అంటే అది వాళ్లకి మంచిది కాదేమో.
అలవాటు ఉంటే పర్వాలేదు కానీ అది లిమిట్స్ లోనే : నాని
మనం చిన్నప్పటి నుంచి ఏదైతే తినేందుకు అలవాటు పడతామో అదే మనకు మంచిది. చిన్నప్పటి నుంచి ఇడ్లీ, నెయ్యి లాంటివి తినడం ఇష్టమయితే అది అలాగే ఉండాలి. మన బాడీని మనం ఒకలాంటి ఫుడ్‌తో ట్రెయిన్ చేసుంటామంటూ తన ఆహారపు అలవాట్ల గురించి నాని వివరించాడు. కంట్రోల్ అవసరం : ఇంట్లో అమ్మ వండే పిండివంటలు చిన్నప్పట్నుంచి అలవాటు ఉంటే బ్రహ్మాండంగా తినొచ్చు కానీ ఎక్కువగా లాగించేయకూడదు. ఇన్నిరోజులు ఇంట్లో భోజనం చేసి ఒకేరోజు సలాడ్ అంటే బాడీ తట్టుకోలేదు కదా.పైగా బాడీ రెడీగా ఉండదు. ఇది నాకు అర్థమయ్యింది. ఒకవేళ ఎవరైనా తప్పుగా తీసుకుంటే సారీ. ఏదైనా, ఏమైనా తినొచ్చు కానీ కంట్రోల్‌లో ఉంటే చాలు అంటూ నాని సలహా ఇచ్చాడు.