Tomato Benefits : చలికాలంలో టమోటాలను ఎక్కువగా తింటే.. ఏమౌతుందో తెలుసా?
టమాట లేని కూర లేదు. ఒకరకంగా వంటలకు రారాజు టమాటాలే. ప్రతి కూరలోనూ టమాటాలను వినియోగిస్తారు. అందువల్ల టమాటాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఆరోగ్యానికి ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే చాలా మందికి టమాటాలను చలికాలంలో తినాలా, వద్దా అనే సందేహం రావడం సహజం. ఈ క్రమంలోనే టమాటాలు పోషకాల గనులని, వాటిలో పుష్కలంగా ఉండే పోషకాహారాలు మన శరీరానికి చాలా అవసరమని వైద్య ఆరోగ్య నిపుణలు అంటున్నారు.చలికాలంలో సైతం కచ్చితంగా రోజూ తీసుకోవాలని చెబుతున్నారు. మిగతా కాలాల్లోనూ వీటిని తినాలని, వీటి ద్వారా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు.
టమాటాల్లో ఏమేం ఉంటాయంటే..
టమాటాల్లో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, విటమిన్ B6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయన్నారు. యాంటీ ఆక్సిడెంట్లు సైతం ఎక్కువ మొత్తంలోనే ఉంటాయన్నారు. ఇటువంటి టమాటాలను రెగ్యులర్'గా స్వీకరించడం వల్ల పలు రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం తగ్గుతుందన్నారు ఆరోగ్య నిపుణులు. మలబద్ధకం, వీరేచనాలు దూరమవుతాయని, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయన్నారు.కప్పు చిన్న టమాటాలు సుమారుగా 2గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుందన్నారు. మరోవైపు డయాబెటిస్ పేషెంట్లు టమాటాలను తినొచ్చుని,బరువు తగ్గాలనుకునేవారు లో-కేలరీ ఫుడ్ టమాటాలను స్వీకరించొచ్చన్నారు. టమాటాలో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది.ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా, యాంటీ ఇన్‌ఫ్లమెటరీగా, యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా పని చేస్తుంది. కాలేయ సంబంధ జబ్బులు, కాలేయ క్యాన్సర్లు వృద్ధి చెందకుండా చూస్తుంది.