
మీ నోటికి కొత్త రుచిని అందించే నేపాలీ వంటకాలను ఒక్కసారి ప్రయత్నించండి
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా కారణంగా అన్ని దేశాల వంటలు పరిచయం అవుతున్నాయి.
జనాలు కూడా రకరకాల ఆహారాలను వండడానికి ప్రయత్నం చేస్తూ తమలోని నైపుణ్యాన్ని బయటకు తీస్తున్నారు.
మీకు వంటలు చేయడం, కొత్త వంటలు టేస్ట్ చేయడం ఇష్టమైతే ప్రస్తుతం కొన్ని నేపాలీ వంటకాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
నేపాలీ వంటకాలు భారతదేశం, చైనా, టిబెట్ వంటకాల సాంప్రదాయాలను కలిసి ఉంటాయి. కొంచెం తీపి, కొంచెం పుల్లగా ఉండే ఈ వంటకాలు మీకు నోరూరిస్తాయి.
Details
నేపాలీ పిరి ఆలూ
ఒక పాత్రలో ఆవాల నూనె మరిగించి అందులో ఎర్ర మిరపకాయలు, మెంతులను వేయండి.
ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. బంగాళదుంపలు ఉడకగానే వాటిని అందులోంచి తీసి పక్కన పెట్టాలి.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత నేపాలీ తైమూర్ పౌడర్, కొత్తిమీర, బంగాళదుంపలు వేసి కలపండి.
అంతే పిరి ఆలూ తయారైపోయింది. చపాతీలు చేసుకుని ఆలూ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.
Details
వెజిటబుల్ మోమోస్
మైదాపిండి, బేకింగ్ పౌడర్, నీళ్లు, ఉప్పు కలిపి పిండి ముద్దను తయారు చేయాలి.
ఇప్పుడు వెల్లుల్లి, ఉల్లిపాయలను నూనెలో వేయించాలి. ఆ తర్వాత దానిలో సన్నగా తరిగిన క్యారెట్, క్యాబేజీ ముక్కలను వేయించాలి. ఇంకా సోయాసాస్, నల్ల మిరియాలు, వెనిగర్ ఉప్పుని అందులో కలపాలి.
ఇప్పుడు పిండి ముద్దతో చిన్నగా చపాతీలు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ చపాతీలలో నూనెలో వేయించుకున్న మిశ్రమాన్ని ఉంచి వాటి చివర్లను మూసివేయాలి.
ఆ తర్వాత 10నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.
Details
కజూరి
ఈ స్వీట్ నేపాల్ లో చాలా ఫేమస్. గోధుమ రవ్వ, నెయ్యి, పిండి, ఉప్పుని ఒక పాత్రలో కలపాలి.
ఆ తర్వాత చక్కెర, పాలు కూడా కలిపి పిండిముద్దలా తయారు చేసి 15నిమిషాలు పక్కన పెట్టాలి.
ఆ తర్వాత ఆ పిండితో చిన్నగా ఉండల మాదిరిగా తయారు చేసుకుని వేడివేడి నూనెలో ఫ్రై చేయాలి.
పెనం లోంచి తీసి చల్లారే వరకు పక్కన పెట్టాలి. అంతే, కజూరి స్వీట్ రెడీ అయిపోయింది.