LOADING...
Curd Benefits: వారానికి రెండు కప్పుల పెరుగు.. పెద్ద పేగుకు రక్షణ కవచం
వారానికి రెండు కప్పుల పెరుగు.. పెద్ద పేగుకు రక్షణ కవచం

Curd Benefits: వారానికి రెండు కప్పుల పెరుగు.. పెద్ద పేగుకు రక్షణ కవచం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2025
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

తరచూ పెరుగు తీసుకోవడం జీర్ణకోశ వ్యవస్థను సమగ్రంగా ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, ఎముకలు గుల్లబారే ప్రమాదం, మధుమేహం ముప్పును తగ్గిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు దీనికి మరొక ముఖ్యమైన లాభం కూడా వెలుగులోకి వచ్చింది. వారానికి రెండు కప్పులు లేదా అంతకంటే ఎక్కువ పెరుగు తినే వారిలో పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా పెద్దపేగులో కుడి వైపున ఏర్పడే క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.

Details

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది

ఎడమ వైపున వచ్చే క్యాన్సర్‌తో పోలిస్తే కుడి వైపు పెద్దపేగు క్యాన్సర్‌ మరింత తీవ్రమైనదిగా పరిగణించబడటం గమనార్హం. పెరుగులో ఉండే మంచిబ్యాక్టీరియా పేగుల్లో బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అదే క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించడంలో సహకరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆహారం, పేగుల్లోని బ్యాక్టీరియా, పెద్దపేగు క్యాన్సర్‌ మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ఈ అధ్యయనం మరోసారి స్పష్టంగా రుజువు చేసింది.

Advertisement