Dasara Navaratri 2023: నేడు ఇద్దరమ్మల దివ్యదర్శనం.. మహిషాసుర మర్దిని, శ్రీరాజరాజేశ్వరీ దేవిగా పూజలు
భారతదేశంలో దేవి శరన్నవరాత్రులు అత్యంత భక్తిశ్రజద్ధలతో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు నవమి, విజయదశమి రెండు రానున్నాయి. ఇందులో భాగంగానే అమ్మవారు రెండు అవతారాల్లో దర్శనం ఇస్తున్నారు. ఉదయం మహిషాసురమర్దిని దేవిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. దసరా నవరాత్రి 2023 చివరి రోజున అమ్మవారు రెండు అలంకారాలలో కనువిందు చేయనున్నారు. నవమి తిథి ఉదయం వరకు మాత్రమే ఉండటం, మధ్యాహ్నం దశమి తిథి ప్రారంభం అవుతుండటంతో ఇవాళ అమ్మవారు రెండు అవతారాల్లో దర్శన భాగ్యం ఇస్తున్నారు. శరన్నవరాత్రుల్లో చివరి అలంకారంగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం నిలవనుంది. బంగారు రంగుర చీరలో దర్శనం ఇవ్వనున్నారు. ఇచ్ఛా, ఙ్ఞాన, క్రియ శక్తులను అమ్మవారు భక్తులకు వరంగా ప్రసాదిస్తుంది.
జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయి
క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యాలను భక్తకోటికి అందించనున్నారు. ఇవాళ నవమి, దశమి సందర్భంగా అమ్మవారిని పూజించి లలితా సహస్ర నామ పారాయణ చేస్తే శ్రేయస్కారం. కుంకుమార్చనలు,సువాసినీ పూజలు చేసినా మంచి ఫలితాలు లభిస్తున్నాయి. లడ్డూ ప్రసాదాలను అమ్మవారికి నివైద్యంగా అర్పిస్తారు. శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్, అష్టోత్తర శతనామావళి పఠించాలి.శ్రీదేవి దండకంతో శరన్నవరాత్రులు ముగియనున్నాయి. విజయదశమి రోజున సాయంత్రం నక్షత్ర దర్శనం(శ్రవణ) సమయంలో జమ్మిచెట్టు వద్ద అపరాజితాదేవిగా పూజిస్తారు. శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ! అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ!! శ్లోకాన్ని పఠించాలి. ఇందులో భాగంగానే జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మకు తగిలిస్తారు. దీంతో అమ్మవారి దయతో తమ కోరికలు నెరవేరుతాయని భక్తజనం నమ్మకం.