
Ugadi 2025: దేశంలో ఏయే ప్రాంతాల్లో ఏయే పేర్లతో ఉగాది జరుపుకుంటారో తెలుసా..
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు పంచాంగం ప్రకారం, ఉగాది పండగతో కొత్త సంవత్సర ప్రారంభమవుతుంది.
ఈ ప్రత్యేక దినాన తయారు చేసే వేపపువ్వు పచ్చడి జీవితపు అసలైన పరమార్ధాన్ని తెలియజేస్తుంది.
మన జీవితంలో సుఖం, దుఃఖం, ఆనందం, విషాదం అన్నీ సహజమైనవని, వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ జీవితం ఆనందకరంగా మార్చుకోవాలని ప్రతిబింబించే సూచికగా ఉగాది పచ్చడిని తింటారు.
ఈ పచ్చడిలోని షడ్రుచులు ఒక్కొక్కటి జీవన సత్యాలను తెలియజేస్తాయి.
వివరాలు
భారతదేశంలో ఉగాది ఉత్సవాలు
తెలుగు ప్రజలు ఉగాదిని వైభవంగా జరుపుకుంటారు.అయితే, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పండగను వివిధ పేర్లతో నిర్వహిస్తారు.
మహారాష్ట్ర:ఈ పండగను"గుడి పడ్వా"గా జరుపుకుంటారు.మరాఠీలు కూడా చాంద్రమాన పంచాంగాన్ని అనుసరించి పండుగలు నిర్వహిస్తారు. గుడి పడ్వా రోజున "బ్రహ్మధ్వజం"ను ప్రతిష్టించి, దీనిపై పట్టువస్త్రాన్ని కప్పి, పువ్వులతో అలంకరిస్తారు.
బెంగాల్: బెంగాలీలు తమ కొత్త సంవత్సరాన్ని "పోయ్ లా బైశాఖ్"గా జరుపుకుంటారు. ఇది వైశాఖ మాసం మొదటి రోజున ప్రారంభమవుతుంది.
తమిళనాడు: తమిళులు ఈ పండుగను "పుత్తాండు" లేదా "చిత్తిరై తిరునాళ్"గా జరుపుకుంటారు.
పంజాబ్: సిక్కులు సౌరమానాన్ని అనుసరించి ఏప్రిల్ 13న తమ కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు, దీనిని "వైశాఖి" అంటారు.
వివరాలు
భారతదేశంలో ఉగాది ఉత్సవాలు
కేరళ: మలయాళ ప్రజలు తమ సంవత్సరాది పండగను "విషు"గా పిలుస్తారు.
సింధీ: ఈ రోజు "చెటి చంద్" పేరుతో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటారు.
మణిపూర్: మణిపురిలు తమ సంవత్సరాదిని "సాజిబు నోంగ్మా పన్బా" పేరుతో జరుపుకుంటారు.
ఇతర దేశాల్లో: బాలి దీవిలో హిందువులు నూతన సంవత్సరాన్ని "నైపి" రోజు జరుపుకుంటారు. మారిషస్‌లో హిందూ ప్రభుత్వ సెలవుల్లో ఉగాది ఒకటి.
వివరాలు
ఉగాది ప్రత్యేకత
ఉగాది రోజున ప్రజలు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి, దేవాలయ సందర్శన చేస్తారు.
ఈ రోజున ముఖ్యంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది, ఇందులో రాబోయే సంవత్సర ఫలితాలను వేద పండితులు వివరిస్తారు.
ఇది ఇతర పండుగలతో పోల్చితే ప్రత్యేకమైన ఆనవాయితీగా నిలుస్తుంది.